AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka Politics: వారం రోజుల్లో సీఎంగా సిద్ధరామయ్య రాజీనామా? కొత్త సీఎం ఎవరంటే?

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ప్రస్తుతం సీఎంగా ఉన్న సిద్ధరామయ్యా.. ఈ వారాతంలో తన పదవికి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. సీఎంగా బాధ్యతలు స్వీకరించేందుకు డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ అధిష్టానం మద్దతు తెలిపిందని.. ఈ నేపథ్యంలోనే సిద్దరామయ్య రాజీనామా చేస్తారని.. తర్వాత సీఎంగా డీకే శివకుమారు బాధ్యతలు చేపడుతారని వర్గాల్లో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

Karnataka Politics: వారం రోజుల్లో సీఎంగా సిద్ధరామయ్య రాజీనామా? కొత్త సీఎం ఎవరంటే?
Siddaramaiah To Resign This Week
Anand T
|

Updated on: May 26, 2026 | 10:25 PM

Share

కర్నాటకలో కుర్చీలాట మళ్లీ మొదటికి వచ్చింది. ఈ వారాతంలో తన పదవికి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. సీఎంగా బాధ్యతలు స్వీకరించేందుకు డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ అధిష్టానం మద్దతు తెలిపిందని.. ఈ నేపథ్యంలోనే సిద్దరామయ్య రాజీనామా చేస్తారని.. తర్వాత సీఎంగా డీకే శివకుమారు బాధ్యతలు చేపడుతారని జోరుగా చర్చ జరిగింది.  అయితే దీనిపై హైకమాండ్ స్పందించింది. రాష్ట్రంలో నాయకత్వ మార్పు లేదని , సిద్దరామయ్య సీఎంగా కొనసాగుతారని కాంగ్రెస్‌ హైకమాండ్‌ స్పష్టం చేసింది. ఢిల్లీలో జరిగిన చర్చల్లో కేవలం రాష్ట్రంలో రాజ్యసభ , ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్ధుల పైనే చర్చ జరిగిందని ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ వెల్లడించారు. సీఎం మార్పుపై వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలే అని స్పష్టం చేశారు కేసీ వేణుగోపాల్‌.

హైకమాండ్‌తో చర్చల తరువాత నవ్వుకుంటూ వెళ్లిపోయారు సిద్దరామయ్య . అయితే ఈ సమావేశంలో సీఎం పదవి నుంచి తప్పుకోవాలని సిద్దరామయ్యను రాహుల్‌గాంధీ కోరినట్టు చెబుతున్నారు. కాని సీఎం పదవికి రాజీనామా చేయడానికి సిద్దరామయ్య నిరాకరించినట్టు చెబుతున్నారు. తనకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని సాక్ష్యాలను కూడా చూపించినట్టు చెబుతున్నారు. సిద్దరామయ్యకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ రాజ్యసభ సీటు ఆఫర్‌ చేసినట్టు చెబుతున్నారు. సిద్దరామయ్య యతీంద్రకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని కూడా హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. డీకే శివకుమార్‌ను సీఎం చేయడానికి హైకమాండ్‌ అన్ని ప్రయత్నాలు చేసినట్టు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us