AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peanuts Benefits: పల్లీలతో ప్రాణాంతక వ్యాధికి చెక్.. డైలీ గుప్పెడు తింటే చాలు

ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం మన రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్త ప్రసరణకు తగ్గడం. అయితే ఖరీదైన మందులు లేకుండా మన వంటగదిలో దొరికే ఒక్క పదార్థంలో ఈ సమస్యను తగ్గించుకోవచ్చంటే మీరు నమ్ముతారా? అవును నమ్మాల్సిందే పేదల బాదంగా పిలవబడే పిల్లీలను డైలీ గుప్పెడు తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇవి గుండెను ఎలా కాపాడుతాయో తెలుసుకుందాం.

Peanuts Benefits: పల్లీలతో ప్రాణాంతక వ్యాధికి చెక్.. డైలీ గుప్పెడు తింటే చాలు
Peanuts Benefits For Heart
Anand T
|

Updated on: Jun 24, 2026 | 2:31 PM

Share

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణం చాలా మంది అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో హార్ట్‌ఎటాక్ కూడా ఒకటి. మనం తినే ఆహారంలోని కోవ్వు మన రక్తకణాల్లోకి చేరి పేరుకుపోవడం ద్వారా ఈ సమస్య పెరుగుతుంది. అయితే ప్రతిరోజూ ఒక గుప్పెడు వేరుశెనగలు తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేరుశెనగలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు.

పల్లీలు గుండె ఆరోగ్యానికి ఎలా సహాయపడుతాయి.

రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది

ఇది గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడాన్ని ‘ప్లేక్’ అంటారు. ఇది రక్తనాళాలను ఇరుకుగా మార్చి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే వేరుశెనగలో ఉండే మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయని నిపునులు అంటున్నారు. అలాగే ఇవి రక్తపోటును నియంత్రించడంలోనూ సహాయపడుతాయని.. వీటిలో ఉండే మెగ్నీషియం, పొటాషియం రక్తనాళాలను రిలాక్స్ చేసి బీనీని కంట్రోల్‌లో ఉంచుతాయని చెబుతున్నారు.

ఎలా తీసుకోవాలి?

ప్రతిరోజూ సుమారు 25-30 గ్రాముల వేరుశెనగలను తీసుకోవడం సరిపోతుంది. నూనెలో వేయించిన లేదా ఎక్కువ ఉప్పు వేసిన పల్లీల కంటే… రాత్రి పూట నీళ్లలో నానబెట్టిన లేదా డ్రై రోస్ట్ చేసిన వేరుశెనగలు ఆరోగ్యానికి చాలా మంచిది. మధుమేహం లేదా గుండె జబ్బుల ముప్పు ఉన్నవారు తమ రోజువారీ ఆహారంలో వేరుశెనగను చేర్చుకోవచ్చు.

Note: వేరుశెనగ ఆరోగ్యకరమైన ఆహారమే అయినప్పటికీ, ఇది ఏ వ్యాధికీ ప్రత్యక్ష ఔషధం కాదు. సమతుల్య ఆహారం, క్రమంతప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు దీన్ని తీసుకుంటేనే ఆశించిన ఫలితాలు లభిస్తాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us