గుడ్లు ఎక్కువగా తింటే ప్రమాదమా?

24 June 2026

TV9 Telugu

TV9 Telugu

గుడ్లు అత్యంత పోషక విలువలు కలిగిన ఆహారాల్లో ఒకటి. అధిక నాణ్యత క‌లిగిన ప్రోటీన్‌ల‌తో పాటు విటమిన్ ఎ, డి, బి12, సెలీనియం, జింక్‌ వంటి కీలక పోషకాలు గుడ్లలో ఉంటాయి

TV9 Telugu

సాధారణంగా ఆరోగ్యవంతులైన పెద్దలు వారానికి మూడు నుంచి నాలుగు సార్లు రోజుకు ఒక గుడ్డు చొప్పున తీసుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు

TV9 Telugu

పిల్లలు రోజుకు ఒక గుడ్డు తినడం వల్ల ఎదుగుదలకు అవసరమైన ప్రోటీన్‌, ఇతర పోషకాలు అందుతాయి

TV9 Telugu

అయితే అధిక కొలెస్ట్రాల్‌ లేదా గుండె జబ్బులు ఉన్నవారు వారానికి మూడు గుడ్లకు పరిమితం కావడం మంచిదని నిపుణులు చెబుతున్నారు

TV9 Telugu

వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను బట్టి వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం. గుడ్లను వండే విధానం కూడా చాలా ముఖ్యం

TV9 Telugu

ఎక్కువ వెన్న, క్రీమ్‌ లేదా చీజ్‌ ఉపయోగించి వండితే అవి జీర్ణం కావడానికి కాస్త కష్టమవుతుంది

TV9 Telugu

అందుకే ఉడకబెట్టిన గుడ్లు, పోచ్‌ చేసిన గుడ్లు లేదా తక్కువ నూనెతో చేసిన స్క్రాంబుల్ గుడ్ల‌ను ఆరోగ్యకరమైన ఎంపికలుగా పరిగణిస్తారు

TV9 Telugu

గుడ్లను కూరగాయలు, తృణధాన్యాలతో కలిపి తీసుకోవడం ద్వారా సమతుల ఆహారం పొందవచ్చు. సరైన మోతాదులో, ఆరోగ్యకరమైన విధంగా గుడ్లను తీసుకుంటేనే వాటి పోషకాలు అందుతాయి