AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీడిన సస్పెన్స్.. సాయికృష్ణ మరణాన్ని ధృవీకరించిన సిట్.. రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన నిజాలు!

విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాయికృష్ణను లాకప్ డెత్ చేసినట్డు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు సిట్ అధికారులు. మృతదేహాన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో చూసినట్టు ఎస్సై వాగ్మూలం ఇచ్చారని సిట్ అధికారులు తెలిపారు.

వీడిన సస్పెన్స్.. సాయికృష్ణ మరణాన్ని ధృవీకరించిన సిట్.. రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన నిజాలు!
Saikrishna Custodial Death
Anand T
|

Updated on: Jun 24, 2026 | 1:40 PM

Share

విజయవాడలో తీవ్ర సంచలనంగా మారిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు కీలక విషయాలను ప్రస్తావించారు. సాయికృష్ణను లాకప్ డెత్ చేసినట్డు రిమాండ్ రిపోర్ట్‌లో సిట్ అధికారులు పేర్కొన్నారు. మృతదేహాన్ని కృష్ణలంక పోలీస్ స్డేషన్ లో చూసినట్టు ఎస్సై వాంగ్మూలం ఇచ్చారని.. సాక్షాలను నాశనం చేయడానికి , పోలీసు కష్టడీలో లేకుండా పోవడానికి సీఐ నాగరాజే కారణమ రాసుకొచ్చారు. సీసీ ఫుటేజ్ డేటా డీవీఆర్ లో లేకుండా చేశారని రిమాండ్‌రిపోర్టులో సిట్ అధికారులు ప్రస్తావించారు.

సాయికృష్ణ మరణించాడని తెలిసినా కూడా కృష్ణలంక పోలీస్ సిబ్బంది ఆ సమాచారం మెజిస్ట్రేట్ కు చేరవేయలేదని, సాయికృష్ణ మరణించాడని తల్లి స్టేషన్ కు వెళితే సీఐ నాగరాజు దూషించాడని రిమాండ్‌రిపోర్ట్‌లో సిట్ పేర్కొంది.హైకోర్టులో సాయికృష్ణ తల్లి హెబియస్ కార్పస్ వేసినా కూడా కోర్ట్ ముందు వాస్తవాలను వెల్లడించలేదని.. హైకోర్ట్ ముందు కూడా నిజాలు దాచి, కోర్ట్ ను తప్పుదోవ పట్టించారని స్పష్టం చేసింది.

ఈ పరిణామాలన్ని గమనించాక సైంటిఫిక్ ఎవిడెన్స్ చెరిపివేయడం ద్వారా సాయికృష్ణను మరణించడని గుర్తించామని.. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఆదారాలు పూర్తిగా ద్వంశం చేశారని..ఈ అన్ని అంశాలు తెలుసుకోవాలంటే నిందుతుడైన నాగరాజును విచారించాల్సి ఉందని సిట్ అధికారులు తెలిపారు.02.06.2026 కంటే ముందే సాయికృష్ణ మరణించాడని తాము విశ్వస్తున్నామని.. కస్టడీలో ఉండగా గాయాలపాలై మరణించాడని అన్ని ఆధారాలు స్పష్టంగా చెబుతున్నాయని తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో
హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో
ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు?సైకాలజీ చెప్పే రహస్యాలుఇవే
ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు?సైకాలజీ చెప్పే రహస్యాలుఇవే
రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా..
పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా..
రొయ్య రైతు పొలికేక...! బరువు దించే నాథుడెక్కడ?
రొయ్య రైతు పొలికేక...! బరువు దించే నాథుడెక్కడ?
ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..!
ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..!
రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే..
రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే..
కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశులివే
తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశులివే
తొలి ఏకాదశి..విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సినవి ఇవే!
తొలి ఏకాదశి..విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సినవి ఇవే!