AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aquaculture: ఏపీలో ఆక్వా రైతుల దుస్థితికి కారణం ఏంటి..? గట్టెక్కేది ఎలా..?

అనాథ రొయ్యగా మారిన ఆంధ్రా రొయ్యకు మళ్లీ పూర్వ వైభవం దక్కే మార్గం ఉన్నట్టా? లేనట్టా? అని మొన్నటిదాకా అనుమానమేఘాలు. దిగాలు పడ్డ రొయ్యరైతును ఊరడించడాలే తప్ప, నిర్మాణాత్మక కార్యాచరణే లేకపోయింది. కానీ, రొయ్య సాగుకు పునరుజ్జీవం ఎంతో దూరంలో లేదనే సంకేతాలైతే ఇప్పుుడిప్పుడే కనిపిస్తున్నాయి. లోకల్‌గా కొనేనాధుడు లేక, ఎగుమతి చేసుకునే వీలులేక, మండుతున్న ఫీడు ధరలను భరించలేక.. అష్టకష్టాల్లో ఉన్న ఆక్వా కల్చర్‌కు ఊపిరిలూదడానికి ప్రభుత్వాల్లో రావల్సిన కదలిక వచ్చినట్టే ఉంది. ఏమిటా కదలిక? ఏపీ ఆర్థికసౌభాగ్యానికి ప్రధానమైన ఆసర అయ్యేనా ఆక్వాకు మళ్లీ మంచిరోజులు.. !

Aquaculture: ఏపీలో ఆక్వా రైతుల దుస్థితికి కారణం ఏంటి..? గట్టెక్కేది ఎలా..?
Ap Aquaculture
Balaraju Goud
|

Updated on: Jul 20, 2026 | 9:50 PM

Share

ఆంధ్రా.. ఆక్వా..! అక్షర క్రమంలోనే కాదు, ఆర్థికపరంగా కూడా తోబుట్టువులు. ఒకప్పుడు ఏపీ ఎకానమీకి వెన్నెముకగా నిలిచింది. అంతర్జాతీయ ఎగుమతులతో కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది ఘనత వహించిన మన ఆక్వారంగం. 3 లక్షల మంది ఆక్వా రైతుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. ఆక్వా రంగం మీద పరోక్షంగా ఆధారపడ్డ 40 లక్షల మంది బతుకులు రోడ్డునపడ్డాయి. వరుస కష్టాలతో రొయ్య సాగు చతికిలపడి, ప్రభుత్వాలు కూడా చేతులెత్తేసిన పరిస్థితి. విధిలేని పరిస్థితుల్లో పంటకు భారీగా కోత పెట్టి కడుపు మాడ్చుకోడానిక్కూడా సై అంటున్నాడు సగటు ఆక్వా రైతు. అదే జరిగితే, ఏపీ ఆర్థిక పరిస్థితి కోమాలోకి పోవడం గ్యారంటీ. ఎందుకంటే, అరవైశాతం సీ-ఫుడ్ ప్రొడక్షన్‌కి కేరాఫ్ మన ఆంధ్రప్రదేశే. ఆక్వా ఎగుమతులతో ఏటా సగటున 66 వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది. మన రొయ్యకు విదేశాల్లో గిరాకీ ఆ రేంజ్‌లో ఉందన్నమాట. అటు, ఏపీ సర్కారు కూడా మేజర్ రెవెన్యూ సోర్స్ ఆక్వా కల్చరే. తెలంగాణకు ఐటీ, ఫార్మా ఇండస్ట్రీలు ఎలాగో, ఆంధ్రా పాలిట బంగారు బాతుగుడ్లు పెట్టే రంగం ఆక్వా. అందుకే, ఇన్నాళ్లూ మైహూనా అని భరోసాలతోనే టైమ్‌పాస్ చేసిన ప్రభుత్వాల్లో సీరియస్‌గా కదలిక వచ్చేసింది. ఆశలు చిగురించి, ఢిల్లీ వైపు ఆర్తిగా చూస్తున్నాడు ఆక్వారైతు. ఆశనిరాశల పోరాటంలో అలసి సొలసిన ఆక్వా రైతు ఇప్పుడు ఆకాశం వైపు దిగాలుగా చూస్తున్నాడు. ఇటు వర్షాభావం.. అటు ధరాభారం!...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌