కెమికల్స్‌తో పండించిన బొప్పాయి పండును ఎలా గుర్తించాలో తెలుసా?
Samatha
26 september 2026
Pic credit - Pinterest
బొప్పాయి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.
బొప్పాయి పండు
అందువలన ప్రతి రోజూ బొప్పాయి పండు తినడం వలన ఇది శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. అంతే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.
ఇష్టంగా తినడం
అందుకే చాలా మంది ప్రతి రోజూ తప్పకుండా బొప్పాయి పండు తినడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. ఎక్కువగా తింటుంటారు.
బొప్పాయి తినడం
కానీ చాలా వరకు ఈ మధ్య కాలంలో బొప్పాయి మార్కెట్‌లోకి సహజంగా పండించినవి కాకుండా కెమికల్స్‌తో పండించినవి మాత్రమే వస్తు్న్నాయి.
కెమికల్స్
మరి అసలు సహజంగా పండిన పండ్లను, కెమికల్స్ ద్వారా పండిన బొప్పాయి పండును ఎలా గుర్తించాలి అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. కాగా, ఇప్పుడు మనం దాని గురించే తెలుసుకుందాం.
సహజ, కెమికల్స్ పండ్లు
మీరు కొనుగోలు చేసే పండ్లు సహజంగానే తియ్యటి వాసన గనుక వస్తున్నట్లు అయితే, అది సహజంగా పండినది, ఎలాంటి వాసన లేకుండా ఉంటే, ఒకసారి దానిని గమనించాలి.
తియ్యటి వాసన
అలాగే కెమికల్స్‌తో పండించిన పండు లోపలి నుంచి పై వరకు ఒకే విధంగా ఉంటుంది. పైన పండినట్లు కనిపించినా,లోపల గట్టిగా ఉంటుంది.
పండు గట్టిగా ఉండటం
ఇక సహజంగా పండిన పండు చేతిలో నొక్కితే చాలు కాస్త మెత్తగా అనిపిస్తుంది. ఇలా ఉన్న పండ్లను కోనుగోలు చేయడం ఆరోగ్యానికి మంచిది.