సౌత్ ఇండస్ట్రీలో కయాదు లోహర్ సంచలనం
చాప కింద నీరులా సౌత్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నారు నటి కయాదు లోహర్. తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ, ప్రస్తుతం ట్రెండింగ్ బ్యూటీగా మారారు. సూర్య, అజిత్, దుల్కర్ సల్మాన్, నాని వంటి స్టార్ హీరోలతో నటిస్తూ, తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఆమె చేతిలో ఉన్న భారీ ప్రాజెక్టులతో, త్వరలో అగ్ర తారగా వెలుగొందనున్నారు.
చాప కింద నీరులా సౌత్ ఇండస్ట్రీలో సంచలనాలు రేపుతున్న భామ కయాదు లోహర్. మొదట్లో నెమ్మదిగా కెరీర్ ప్రారంభించినా, ఇప్పుడు ఎక్కడ చూసినా ఈమె పేరే వినిపిస్తోంది. తమిళం, తెలుగు, మలయాళం అని తేడా లేకుండా అన్ని చోట్లా తనదైన నటనతో ఆకట్టుకుంటున్నారు. అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తున్న కయాదు, ప్రస్తుతం దక్షిణాదిలో ట్రెండింగ్ హీరోయిన్‌గా మారారు.ముఖ్యంగా తమిళనాట ఆమె చక్రం తిప్పుతున్నారు. సూర్య నటిస్తున్న 48వ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్‌గా ఎంపికయ్యారు. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో పాటు, అజిత్ హీరోగా అజిత్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్న సినిమాలోనూ ఈమె హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అజిత్ స్వయంగా నిర్మిస్తున్నారు.కోలీవుడ్ మాత్రమే కాకుండా, మలయాళంలోనూ కయాదు పేరు బాగా వినిపిస్తుంది. టోవినో థామస్‌తో కలిసి పల్లి చాటాంబి సినిమాలో నటించిన ఈమె, తాజాగా దుల్కర్ సల్మాన్‌తో ఐ యామ్ గేమ్ చిత్రంలో నటిస్తున్నారు.
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!
ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? డేంజర్ బెల్స్ మోగినట్టే
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు..

