AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: స్లిమ్ చేస్తానని నమ్మించి.. యువతిని హోటల్ రూమ్‌కు రప్పించిన జిమ్ ట్రైనర్.. ఆపై..!

విజయవాడలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన జిమ్ ట్రైనర్, బరువు తగ్గిస్తానని నమ్మించి మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

Vijayawada: స్లిమ్ చేస్తానని నమ్మించి.. యువతిని హోటల్ రూమ్‌కు రప్పించిన జిమ్ ట్రైనర్.. ఆపై..!
Gym Trainer Absenced
Balaraju Goud
|

Updated on: Jul 20, 2026 | 4:23 PM

Share

విజయవాడలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన జిమ్ ట్రైనర్, బరువు తగ్గిస్తానని నమ్మించి మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

విజయవాడలో ఓ యువతిపై జిమ్ ట్రైనర్ అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలు కలకలం రేపాయి. బాధిత యువతి ఫిర్యాదు మేరకు సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం, ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న యువతికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్‌తో పరిచయం ఏర్పడింది. బరువు తగ్గాలనుకుంటున్న తనకు ఫిట్‌నెస్, డైట్‌కు సంబంధించిన సూచనలు ఇస్తూ నిందితుడు సన్నిహితంగా మారినట్లు యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. కొంతకాలం తర్వాత మాట్లాడాల్సిన అవసరం ఉందంటూ ఓ ప్రైవేట్ హోటల్‌కు తీసుకెళ్లిన అబ్దుల్ ఖాదర్, బరువు తగ్గేందుకు ప్రత్యేక షేక్ అంటూ ఒక పానీయం ఇచ్చాడని యువతి ఆరోపించింది. ఆ పానీయం తాగిన అనంతరం తనకు మత్తు రావడంతో స్పృహ కోల్పోయానని, ఆ సమయంలో తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా, నగ్న ఫోటోలు తీసి వాటిని చూపిస్తూ బెదిరింపులకు పాల్పడినట్లు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య నివేదికలు, సాక్ష్యాధారాలు, డిజిటల్ ఆధారాలను సేకరిస్తూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత నిందితుడు అబ్దుల్ ఖాదర్ పరారైనట్లు సమాచారం. అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని, దర్యాప్తు పూర్తయ్యాక పూర్తి వివరాలను వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
'ది ప్యారడైజ్' సినిమాకు నెగెటివ్ రివ్యూలు, హీరో నాని ఏమన్నారంటే?
'ది ప్యారడైజ్' సినిమాకు నెగెటివ్ రివ్యూలు, హీరో నాని ఏమన్నారంటే?
2023లో గణితంలో నోబెల్ బహుమతి ఎవరు గెలిచారు? UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
2023లో గణితంలో నోబెల్ బహుమతి ఎవరు గెలిచారు? UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
ట్రైన్ ఆలస్యమైందా..? రైల్వే స్టేషన్లలో రూ.100కే రూమ్..
ట్రైన్ ఆలస్యమైందా..? రైల్వే స్టేషన్లలో రూ.100కే రూమ్..
ఉదయపు టిఫిన్‌గా అదిరిపోయే కమ్మని బియ్యపు రవ్వ పులిహోర
ఉదయపు టిఫిన్‌గా అదిరిపోయే కమ్మని బియ్యపు రవ్వ పులిహోర
పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఇక విత్‌డ్రా చేయడం మరింత ఈజీ
పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఇక విత్‌డ్రా చేయడం మరింత ఈజీ
అక్టోబర్ నెలలో వీరి జీవితంలో కీలక మలుపు..! లిస్ట్‌లో మీ రాశి ఉందా
అక్టోబర్ నెలలో వీరి జీవితంలో కీలక మలుపు..! లిస్ట్‌లో మీ రాశి ఉందా
రష్యాపై వందల డ్రోన్లతో దాడి.. చమురు రిఫైనరీని ఉక్రెయిన్ ధ్వంసం
రష్యాపై వందల డ్రోన్లతో దాడి.. చమురు రిఫైనరీని ఉక్రెయిన్ ధ్వంసం
ఇదబ్బా అసలైన గోంగూర పచ్చడి.. ఒక్క ముద్ద రుచి చూస్తే అస్సలు వదలరు!
ఇదబ్బా అసలైన గోంగూర పచ్చడి.. ఒక్క ముద్ద రుచి చూస్తే అస్సలు వదలరు!
గణపతి నిమజ్జనం ఎందుకు చేస్తారో తెలుసా? వెనుక ఉన్న రహస్యం ఇదే!
గణపతి నిమజ్జనం ఎందుకు చేస్తారో తెలుసా? వెనుక ఉన్న రహస్యం ఇదే!
SBIలో 222 ఉద్యోగాలు.. మరికొన్ని గంటలే అవకాశం!
SBIలో 222 ఉద్యోగాలు.. మరికొన్ని గంటలే అవకాశం!