AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: ఇక వర్షాలే వర్షాలు.. చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ.. ఇదిగో వెదర్ రిపోర్ట్..

మార్చి నెలలోనే ఎండ తీవ్రతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణశాఖ చల్లటి కబురు చెప్పింది. పశ్చిమ హిమాలయాలను సమీపిస్తున్న పశ్చిమ అల్పపీడనం కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో తుఫాను పరిస్థితులు ఏర్పడ్డాయి. ఢిల్లీ, హర్యానా, యుపి, రాజస్థాన్, హిమాచల్, పంజాబ్‌లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.

Rain Alert: ఇక వర్షాలే వర్షాలు.. చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
Weather Alert
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Mar 15, 2026 | 10:57 AM

Share

మార్చి నెలలోనే ఎండ తీవ్రతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణశాఖ చల్లటి కబురు చెప్పింది. పశ్చిమ హిమాలయాలను సమీపిస్తున్న పశ్చిమ అల్పపీడనం కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో తుఫాను పరిస్థితులు ఏర్పడ్డాయి. ఢిల్లీ, హర్యానా, యుపి, రాజస్థాన్, హిమాచల్, పంజాబ్‌లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఈ సీజన్ లో ఇవి ప్రీ-మాన్‌సూన్ వర్షాలు.. వీటి వల్ల గరిష్ట ,కనిష్ట ఉష్ణోగ్రతల్లో సగటున 5 డిగ్రీల వరకు మార్పు వచ్చిందని.. సోమవారం కనిష్ట ఉష్ణోగ్రత 14-16 డిగ్రీల సెల్సియస్‌గా… గరిష్ట ఉష్ణోగ్రత 31-33 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

గత బుధవారం అత్యధికంగా ఢిల్లీలో 36.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత, 20.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.. వర్షాల ప్రభావంతో రానున్న వారం రోజులపాటు ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. పశ్చిమ హిమాలయాలు, దాని పరిసర మైదానాలలో రానున్న రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగళ్ల తుఫాను సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం పశ్చిమ అల్పపీడనం కారణంగా ఢిల్లీ ఎన్సీఆర్ లో కురుస్తున్న వర్షం కురుస్తుంది.

ఢిల్లీకి ఆరెంజ్ అలెర్ట్, నోయిడా, గురుగ్రామ్‌లకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో అధిక ఉష్ణోగ్రతల నుండి ఢిల్లీ వాసులకు ఉపశమనం లభించినట్లైంది. ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా లోని కొన్ని ప్రాంతాల్లో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.హిమాచల్ ప్రదేశ్‌లోని కులు, మండి, సిమ్లా జిల్లాల్లో మార్చి 18 వరకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ..

తెలుగు రాష్ట్రాల్లో సైతం వర్షాలు..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సైతం వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు గరిష్టముగా 50 కిలోమీటర్లు వేగముతో వీస్తాయని పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us