AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: జాతి వైరం మరిచిన మూగ జీవి.. కుక్క పిల్లను అక్కున చేర్చుకుని అమ్మ ప్రేమను పంచిన వానరం..!

బంధాలు - అనుబంధాలను మరిచి అయినవారి పట్లనే కర్కషంగా వ్యవహరించే వారు ఉన్న ఆధునిక సమాజంలో మూగజీవాలు జాతి వైరాన్ని మరచి ఆప్యాయతలను ప్రదర్శిస్తున్నాయి. మానవత్వం మంటగలుస్తున్న ప్రస్తుత సమాజానికి స్ఫూర్తిదాయక సందేశాన్ని అందిస్తున్నాయి. కన్నవారు, కట్టుకున్న వారు, తోబుట్టువులు, రక్తసంబంధికులు.. ఇలా సొంతవారి పట్లనే స్వార్థం, ఈర్ష ద్వేషాలతో కర్కశంగా వ్యవహరిస్తున్న వారు ప్రస్తుత సమాజంలో అనేకమంది ఉన్నారు.

Watch: జాతి వైరం మరిచిన మూగ జీవి.. కుక్క పిల్లను అక్కున చేర్చుకుని అమ్మ ప్రేమను పంచిన వానరం..!
Monkey,ppuppy Dog Love
G Sampath Kumar
| Edited By: |

Updated on: Mar 15, 2026 | 11:11 AM

Share

బంధాలు – అనుబంధాలను మరిచి అయినవారి పట్లనే కర్కషంగా వ్యవహరించే వారు ఉన్న ఆధునిక సమాజంలో మూగజీవాలు జాతి వైరాన్ని మరచి ఆప్యాయతలను ప్రదర్శిస్తున్నాయి. మానవత్వం మంటగలుస్తున్న ప్రస్తుత సమాజానికి స్ఫూర్తిదాయక సందేశాన్ని అందిస్తున్నాయి. కన్నవారు, కట్టుకున్న వారు, తోబుట్టువులు, రక్తసంబంధికులు.. ఇలా సొంతవారి పట్లనే స్వార్థం, ఈర్ష ద్వేషాలతో కర్కశంగా వ్యవహరిస్తున్న వారు ప్రస్తుత సమాజంలో అనేకమంది ఉన్నారు. కానీ, మూగజీవాలు జాతి వైరాన్ని కూడా మరిచి ఇతర జీవాల పట్ల ప్రదర్శిస్తున్న ప్రేమ – ఆప్యాయతలు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి.

సరిగ్గా ఇలాంటి అరుదైన సంఘటన ఒకటి.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆవిష్కృతమైంది. నగరంలోని హనుమాన్ నగర్ లో ఓ వానరం, దారి తప్పిన కుక్క పిల్లను అక్కున చేర్చుకుంది. అమ్మలా ఆప్యాయంగా లాలించింది. తల్లి నుండి దూరమైన ఓ కుక్కపిల్ల ఎండ వేడిమిని భరించలేక నెమ్మది నెమ్మదిగా చెట్టు నీడకు వచ్చింది. దిక్కుతోచక ఒంటరిగా ఇబ్బందులు పడుకుంటూ వచ్చిన కుక్కపిల్లను చెట్టుపై నుండి గమనించిన ఓ కోతి కిందకు దిగి వచ్చి కుక్కపిల్లను అక్కున చేర్చుకుంది.

రోజుల పసికూన అయిన కుక్కపిల్లను అమ్మలా ఆప్యాయంగా లాలించింది. సదరు కుక్క పిల్ల సైతం తల్లిలా భావించి వానరం ఒడిలో సేద తీరింది. ఈ అపురూప సన్నివేశం చూపరులందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. జాతి వైరాన్ని మరిచి వానరం చూపించిన ఆప్యాయతను అందరూ ప్రశంసించారు. క్రూరత్వంతో మెదులుతున్న మనుషుల కంటే, మూగజీవాలే ఎంతో నయమనే అభిప్రాయాలు ఈ సన్నివేశం తిలకించిన వారి నుండి వ్యక్తమవుతున్నాయి.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్