AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Cylinder: వీరికి గ్యాస్ సిలిండర్ల డెలివరీ బంద్.. కేంద్రం సంచలన ప్రకటన.. వెనక్కి ఇచ్చేయాలని ఆదేశాలు

కేేంద్ర ప్రభుత్వం షాకింగ్ డెసిషన్ తీసుకుంది. పైప్ లైన్ గ్యాస్ వాడుతున్నవారికి బ్యాడ్ న్యూస్ తెలిపింది. పైప్డ్ నేచురల్ గ్యాస్ వాడుతున్నవారు తమ ఎల్పీజీ సిలిండర్లను సరెండర్ చేయాలని ఆదేశించింది. పైప్డ్ గ్యాస్ వాడుతూ మళ్లీ ఎల్పీజీ సిలిండర్లను వినియోగించడం సరికాదంది.

Gas Cylinder: వీరికి గ్యాస్ సిలిండర్ల డెలివరీ బంద్.. కేంద్రం సంచలన ప్రకటన.. వెనక్కి ఇచ్చేయాలని ఆదేశాలు
Gas Cylinder
Venkatrao Lella
|

Updated on: Mar 15, 2026 | 8:40 AM

Share

గ్యాస్ సిలిండర్ల డెలివరీపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వాడేవారు ఎల్పీజీ కనెక్షన్లను తీసుకోవద్దని ఆదేశించింది. అంతేకాక వీరికి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కనెక్షన్లను మంజూరు చేయవద్దని ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కనెక్షన్లు ఉన్నావారు తమ సిలిండర్లను సరెండర్ చేయాలని ఆదేశించింది. పైప్‌లైన్ గ్యాస్ వాడుకుంటూ మళ్లీ సిలిండర్లను వాడటం సరికాదని సూచించింది. ఈ మేరకు తాజాగా కేంద్రం ఓ ప్రకటన జారీచేసింది. పైప్ లైన్ గ్యాస్ వాడుతున్నవారికి ఏజెన్సీలు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయవద్దని తన ఆదేశాల్లో పేర్కొంది.

ఆ గ్యాస్ కనెక్షన్లను వెనక్కి తీసుకోండి

ఒకవేళ పైప్డ్ నేచురల్ గ్యాస్ వాడుతున్నవారి దగ్గర ఎల్పీజీ సిలిండర్లు ఉంటే ఏజెన్సీలు వెనక్కి తీసుకోవాలని కేంద్రం సూచించింది. గ్యాస్ కొరత క్రమంలో కేంద్రం ఈ ప్రకటన విడుదల చేసింది. పైప్ లైన్ గ్యాస్ వాడుతున్నవారికి గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేయడంపై నిషేధం అమల్లోకి తెస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కస్టమర్లు స్వయంగా తమ గ్యాస్ కనెక్షన్లు సరెండర్ చేయాల్సిందేనని, లేకపోతే చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేసింది. పైప్డ్ లైన్ గ్యాస్ వాడుతూ మళ్లీ సిలిండర్లు తీసుకోవడం మంచిది కాదంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కడప లాంటి పలు ప్రాంతాల్లో పైప్డ్ గ్యాస్ సౌకర్యం ఉంది. దీంతో చాలామంది ఈ సదుపాయం ఉపయోగించుకుంటున్నారు.

బుకింగ్ చేసుకున్న అందరికీ గ్యాస్

ఇక గ్యాస్ కొరతపై కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. గ్యాస్ బుకింగ్ చేసుకున్న అందరికీ సకాలంలో గ్యాస్ అందిస్తున్నామని స్పష్టం చేసింది. గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని, ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించింది. చాలామంది అవసరం లేకపోయినా గ్యాస్ బుక్ చేసుకుంటున్నారని, ప్రాధాన్యత క్రమంలో వారికి సరఫరా చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక వాణిజ్య సిలిండర్లకు సంబంధించి రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నామని, హోటల్స్, రెస్టారెంట్లకు కూడా ప్రాధాన్యత క్రమంలో పంపిణీ చేస్తామని తెలిపింది. సిలిండర్ల అందుబాటుని బట్టి సరఫరా చేస్తామని, ఎవరూ ప్యానిక్ అవ్వొద్దని సూచించింది. ఇళ్లు, ఆస్పత్రులు, హాస్టళ్లకు గ్యాస్ సరఫరా చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని భారత చమురు శాఖ సంయుక్త కార్యదర్శి(మార్కెటింగ్, ఆయిల్ రిఫైనరీ) సుజాత శర్మ పేర్కొన్నారు. సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్‌పై ఫోకస్ పెట్టామని ,అలాంటి చర్యలకు పాల్పడేవారికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పలు రాష్ట్రాల్లో అనేక సిలిండర్లను సీజ్ చేసినట్లు చెప్పారు. బ్లాక్ మార్కెటింగ్‌ను అడ్డుకోవాలని రాష్ట్రాలను కోరామన్నారు.

Follow Us