AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? ఒకప్పుడు వందల కోట్ల ఆస్తులున్న టాలీవుడ్ హీరో.. ఇప్పుడు మాత్రం..

స్టార్ దర్శకుడు కమ్ ప్రొడ్యూసర్ కుమారుడంటే సినిమా అవకాశాలు వెల్లువలా వస్తాయి. కానీ ఈ హీరో మాత్రం కెరీర్ ప్రారంభంలో చాలా స్ట్రగుల్ అయ్యాడు. సినిమాల్లో అవకాశాలు సంపాదించుకోవడానికి చాలా కష్టపడ్డాడు. సినిమాలు చేస్తున్నా సక్సెస్ ఫుల్ హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా సమయమే తీసుకున్నాడు.

Tollywood: ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? ఒకప్పుడు వందల కోట్ల ఆస్తులున్న టాలీవుడ్ హీరో.. ఇప్పుడు మాత్రం..
Jagapathi Babu Childhood Photo
Basha Shek
|

Updated on: Oct 04, 2025 | 7:06 PM

Share

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఈ కుర్రాడు ఒకప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో. తన నటనతో ఎంతో మంది అమ్మాయిల మనసులను కొల్లగొట్టేశాడు. స్టార్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. కెరీర్ ప్రారంభంలో పెద్దగా అవకాశాలు రాకపోయినా తర్వాత హీరోగా స్థిరపడిపోయాడు. కథానాయకుడిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. ప్రధానంగా ప్రేమ కథా చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలతో అమ్మాయిలకు, ఫ్యామిలీ ఆడియన్స్ కు ఫేవరెట్ నటుడిగా మారిపోయాడు. తెలుగు నాట శోభన్ బాబు తర్వాత రేంజ్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకున్న హీరో ఇతనే. అయితే ఎన్నో సినిమాలు చేసి కోట్లాది ఆస్తులు కూడ బెట్టాడీ హ్యాండ్సమ్ హీరో. కానీ ఉన్నట్లుండి డౌన్ అయిపోయాడు. చేసిన సినిమాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. దీనికి తోడు వ్యక్తిగత జీవితంలోనూ కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. ఫలితంగా కోట్లాది ఆస్తులు ఇట్టే కరిగిపోయాయి. అయితే గోడకు కొట్టిన బంతిలా మళ్లీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. విలన్ గా నూ, సపోర్టింగ్ ఆర్టిస్టుగా, ఇప్పుడు బుల్లితెర యాంకర్ గానూ సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీగా ఉంటోన్న ఆర్టిస్టుల్లో ఆయన కూడా ఒకరు. ఇంతకీ పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆయన మరెవరో కాదు జగ్గూ భాయ్ అలియాస్ జగపతి బాబు.

సుమారు 63 ఏళ్ల జగపతి బాబు ఇప్పుడు తీరిక లేని షూటింగులతో బిజి బిజీగా గడుపుతున్నారు. ఏడాది జగ్గు భాయ్ నటించిన మూడు సినిమాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పటికీ థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న మిరాయ్ లో జగ్గూ భాయ్ ఒక కీలక పాత్ర పోషించాడు. అలాగే అనుష్క ఘాటీలోనూ కీ రోల్ ప్లే చేశాడు. ఇక హిందీలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన జాట్ లోనూ మెరిశారు జగ్గూభాయ్. ప్రస్తుతం సీనియర్ నటుడి చేతిలో రామ్ చరణ్ పెద్ది లాంటి క్రేజీ ప్రాజెక్టు ఉంది.

ఇవి కూడా చదవండి

ఇంట్లో స్వయంగా వంట చేసుకుంటోన్న జగపతి బాబు..

ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హోస్ట్ గా బుల్లితెర ఆడియెన్స్ ను అలరిస్తున్నాడు జగ్గూ భాయ్. ప్రస్తుతం జయంబు నిశ్చయంబురా అనే టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడీ సీనియర్ నటుడు. నాగార్జున, శ్రీలీలీ, ఆర్జీవీ, సందీప్ రెడ్డి వంగా లాంటి స్టార్ సెలబ్రిటీలు షోలో సందడి చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిజినెస్ ఐడియా మీది.. పెట్టుబడి వీళ్లది!
బిజినెస్ ఐడియా మీది.. పెట్టుబడి వీళ్లది!
అనంత్ అంబానీ వాచ్ విలువ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
అనంత్ అంబానీ వాచ్ విలువ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్.. కట్ చేస్తే 200కు పైగా
ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్.. కట్ చేస్తే 200కు పైగా
మీ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసే యాప్స్‌ సురక్షితమేనా..? గుర్తించడం ఎలా
మీ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసే యాప్స్‌ సురక్షితమేనా..? గుర్తించడం ఎలా
పనికిరావని పారేస్తున్నారా? ఈ గింజలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష!
పనికిరావని పారేస్తున్నారా? ఈ గింజలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష!
భూగర్భంలో అతిపెద్ద బంగారు నిధి.. 3400 టన్నుల గోల్డ్‌ గుర్తింపు!
భూగర్భంలో అతిపెద్ద బంగారు నిధి.. 3400 టన్నుల గోల్డ్‌ గుర్తింపు!
అప్పుడెప్పుడో మాయం అయ్యింది.. ఇప్పుడు మెగాస్టార్ మూవీతో ఛాన్స్..
అప్పుడెప్పుడో మాయం అయ్యింది.. ఇప్పుడు మెగాస్టార్ మూవీతో ఛాన్స్..
నారింజ పండ్ల తొక్కలు పడేస్తున్నారా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే
నారింజ పండ్ల తొక్కలు పడేస్తున్నారా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే
దుర్వాసనను స్పాంజ్‌లా పీల్చేస్తుంది.. యాపిల్ చేసే మ్యాజిక్ ఇదే
దుర్వాసనను స్పాంజ్‌లా పీల్చేస్తుంది.. యాపిల్ చేసే మ్యాజిక్ ఇదే
గంగవ్వ శతాయుష్కురాలు.. 101 పడిలోకి అడుగు
గంగవ్వ శతాయుష్కురాలు.. 101 పడిలోకి అడుగు