ఇట్స్ అఫీషియల్..! ఓటీటీలోకి రవితేజ మాస్ జాతర.. స్ట్రీమింగ్ ఎక్కడ.. ఎప్పుడంటే..
మాస్ మహారాజ రవితేజ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడెప్పుడో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా తర్వాత రవితేజ హిట్ అందుకోలేకపోతున్నాడు. రీసెంట్ గా ఆయన నటించిన మాస్ జాతర సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు భాను దర్శకత్వం వహించారు.

మాస్ మహారాజా రవితేజ నటించిన లేటేస్ట్ మూవీ మాస్ జాతర. ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ భాను భోగవరపు దర్శకత్వం వహించగా.. ఇందులో శ్రీలీల కథానాయికగా నటించింది. రవితేజ కెరీర్ లో 75వ సినిమాగా వచ్చిన ఈ మూవీపై ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ధమాకా హిట్ తర్వాత మరోసారి శ్రీలీల, రవితేజ కాంబోలో వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి హైప్ నెలకొంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించామని ముందు నుంచి చిత్రయూనిట్ ప్రకటించింది. అలాగే టీజర్, ట్రైలర్, సాంగ్స్ సైతం ఆకట్టుకున్నాయి. కానీ విడుదలైన తర్వాత ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. మిక్స్ టాక్ సొంతం చేసుకుంది. అక్టోబర్ 31న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు.
ఏం సినిమా రా బాబు.! భయంతో వాంతులు చేసుకోవడం ఖాయం.. ఎక్కడ చూడొచ్చంటే
మిక్స్డ్ టాక్ సొంతం చేసుకోవడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. మాస్ జాతర సినిమా ఓటీటీ రిలీజ్ పై ఇప్పటికే రకరకాల వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు మాస్ జాతర సినిమా ఓటీటీ డేట్ లాక్ అయ్యిందని తెలుస్తుంది. ఈమేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇస్తూ పోస్టర్ ను విడుదల చేశారు. నవంబర్ 28న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
లక్ అంటే ఈ బ్యూటీదే.. స్టార్ హీరో సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న క్రేజీ హీరోయిన్.. 11ఏళ్ల తర్వాత ఇలా..
నెట్‌ఫ్లిక్స్ వేదికగా నవంబర్ 28 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. నెట్ ఫ్లిక్స్ మాస్ జాతర సినిమా రైట్స్ ను ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకుందని తెలుస్తుంది. ఇక మాస్ జాతర సినిమాలో రవితేజ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు. అలాగే శ్రీలీల కూడా తన అందంతో నటనతో మెప్పించింది. ఇక ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక ఇప్పుడు రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలకానుంది.
రోజూ రాత్రి అలా చేయకపోతే నాకు నిద్రపట్టదు.. ఫిజికల్ టచ్ ఉండాల్సిందే అంటున్న బ్యూటీ
Ee massodu mee intiki jathara ni theeskosthunnadu! 🔥 pic.twitter.com/Fhc3TpTqL3
— Netflix India South (@Netflix_INSouth) November 25, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
