Gas Cylinder: గ్యాస్ పేరుతో ఎక్కువ డబ్బులు అడుగుతున్నారా..? ఈ నెంబర్‌కు ఫిర్యాదు చేయండి..
గ్యాస్ కొరత క్రమంలో కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు గ్యాస్ బిల్లు పేరుతో ప్రత్యేకంగా ఛార్జిలు వసూలు చేస్తున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఇలా అదనపు ఛార్జీలు వసూలు చేయవద్దని సూచించింది. ఎవరైనా చేస్తే ఫిర్యాదు చేసేందుకు ఓ నెంబర్‌ను తీసుకొచ్చింది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి మూసివేత క్రమంలో భారత్ ఎల్పీజీ గ్యాస్ సమస్యల్లో చిక్కుకుంది. గ్యాస్ కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ బుక్ చేసినా ఇంటికి రాకపోవడం, ఆలస్యంగా డెలివరీ కావడం వంటి సమస్యలు ఎదురువుతున్నాయి. దీనిని అదునుగా చేసుకుని దళారులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తున్నారు. ఇక హోటల్ యజమానులు ఎల్పీజీ గ్యాస్ సమస్యను తమనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మెనూను మార్చడంతో పాటు గ్యాస్ బిల్లు పేరుతో అదనపు రుసుంలు కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో వినియోగదారుల వ్యవహారాల శాఖ స్పందించింది.
ఎక్కువ అడిగితే ఫిర్యాదు చేయొచ్చు
గ్యాస్ బిల్లు పేరుతో మెనూలో ఉన్న ధరల కంటే ఎక్కువ ధరలు వసూలు చేస్తే కస్టమర్లు ఫిర్యాదు చేయాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అదనంగా పన్నులు వాటిని మత్రమే చెల్లించండి. గ్యాస్ పేరుతో అదనంగా అడిగితే ఫిర్యాదు చేయాలని సూచించింది. ముందుగా గ్యాస్ లేదా ఇంధన ఛార్జీలు చెల్లించమని అడిగితే.. ముందుగా వాటిని తొలగించమని అడగాలి. హోటల్ సిబ్బంది నిరాకరిస్తే ఎన్‌సీహెచ్ 1915 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపింది. ఈ ఈ-జాగృతి పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. జిల్లా మెజిస్ట్రేట్ లేదా సీపీపీఏకు కూడా ఫిర్యాదు చేయొచ్చు. గ్యాస్ పేరుత అదనపు బిల్లులు వసూలు చేస్తే చెల్లించాల్సిన అవసరం లేదని వినియోగదారలు వ్యవహారాలశాఖ స్పష్టం చేసింది. కస్టమర్లు దీనిని గమనించి తమకు ఫిర్యాదు చేయాలని కోరింది.
Charged extra “LPG fees” on your bill? Not acceptable—pay only the menu price (plus taxes), and if you notice any such charges, get them removed or report it via NCH 1915 or e-Jagriti. #LPGCharge #UnfairTradePractice #FuelCharge #JagoGrahakJago #NCH1915 pic.twitter.com/ExNbo6XzIo
— Consumer Affairs (@jagograhakjago) March 31, 2026
