AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రియురాలికి ప్రపోజ్ చేయబోతే రింగ్ జారిపడింది.. చివరకు..

ప్రియురాలికి ప్రపోజ్ చేయబోతే రింగ్ జారిపడింది.. చివరకు..

Phani CH
|

Updated on: Apr 01, 2026 | 7:58 PM

Share

ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా ఓ యువకుడు తన ప్రియురాలికి ప్రపోజ్ చేయగా, రింగ్ చేతిలోంచి జారి కిందపడింది. వాంఖేడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ vs కేకేఆర్ మ్యాచ్‌లో ఈ సంఘటన జరిగింది. కొద్దిసేపు గందరగోళం తర్వాత రింగ్ దొరకడంతో, అతను మళ్లీ ప్రపోజ్ చేసి ఆమె ప్రేమను గెలుచుకున్నాడు. ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా ఒక క్రికెట్ అభిమాని తన ప్రియురాలికి ప్రపోజ్ చేయాలనుకున్నాడు. కానీ చేతిలోని రింగ్ కిందపడటంతో కొన్ని నిమిషాలు గందరగోళం చోటుచేసుకుంది. ఈ సంఘటన ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా జరిగింది. దీనిని ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియోను కోల్‌‌కతా నైట్ రైడర్స్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ముంబై ఇండియన్స్ జెర్సీ ధరించిన ఒక యువకుడు, కోల్‌కతా నైట్ రైడర్స్ జెర్సీలో ఉన్న తన ప్రియురాలికి ప్రపోజ్ చేయాలనుకున్నాడు. మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్న సమయంలో, అతను మోకాళ్లపై కూర్చుని తన ప్రేమను వ్యక్తపరచడానికి సిద్ధమయ్యాడు. సరిగ్గా అదే సమయంలో ఊహించని సీన్‌ జరిగింది. ప్రేయసికి ప్రపోజ్‌చేద్దామని అతను రింగ్ తీస్తుండగా, అతని చేయి వణికిందో ఏమోకానీ, అది ఒక్కసారిగా చేతిలోంచి జారి కిందపడిపోయింది. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. ప్రపోజ్ చేయాల్సిన యువకుడు కంగారుగా కింద వెతకడం మొదలుపెట్టగా, చుట్టుపక్కల ఉన్న ప్రేక్షకులు కూడా అతనికి సహాయం చేస్తూ రింగ్ కోసం వెతికారు. లక్కీగా ఓ వ్యక్తి ఆ ఉంగరాన్ని గుర్తించి అతనికి అందించాడు. రింగ్ దొరకగానే ఆ యువకుడు మళ్లీ మోకాళ్లపై కూర్చుని తన ప్రియురాలికి ప్రపోజ్ చేశాడు. ఆమె ఆనందంతో అతని ప్రపోజల్‌ను అంగీకరిస్తూ తన ప్రేమను తెలిపింది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన తోటి ప్రేక్షకులు చప్పట్లతో ఆ జంటను అభినందించారు. ఈ క్యూట్ వీడియోను కేకేఆర్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో, ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మంచు గుప్పిట్లో ఉత్తర కాశ్మీర్.. బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు

ధ్వజస్తంభంపై చిలుక..ఎగిరిపోయిందో.. ప్రళయమే!

పర్యాటకమా ?? ప్రాణ సంకటమా ?? భద్రతా ప్రమాణాలు లేవు

సర్పంచ్ ఇంట్లో వింత శబ్ధాలు.. వెళ్లిచూడగా షాకైన కుటుంబం

Jayalalithaa: హైదరాబాద్‌లోని జయలలిత భవనం సీజ్‌.. కారణం ఇదే

Follow Us