Jayalalithaa: హైదరాబాద్‌లోని జయలలిత భవనం సీజ్.. కారణం ఇదే
దివంగత సీఎం జయలలిత హైదరాబాద్‌లోని నివాసాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు సీజ్ చేశారు. యూసుఫ్‌గూడ శ్రీనగర్ కాలనీలో ఉన్న ఈ ఇంటికి సుమారు రూ. 83 లక్షల మేర ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోయాయి. 2017 నుండి పన్నులు చెల్లించకపోవడం, నోటీసులకు స్పందన లేకపోవడం, వన్ టైమ్ సెటిల్మెంట్ పథకం గడువు ముగియడంతో అధికారులు ఈ చర్య తీసుకున్నారు.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన హైదరాబాద్‌లోని నివాసాన్ని అధికారులు సీజ్ చేశారు. యూసుఫ్‌గూడ సర్కిల్-38 పరిధిలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఈ ఇంటికి సంబంధించి భారీగా పన్ను బకాయిలు పేరుకుపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సుమారు రూ. 83 లక్షల మేర ఇంటి పన్ను చెల్లించకపోవడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. 2017 నుంచి ఈ భవనానికి సంబంధించిన ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో అధికారులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఈ భవనాన్ని వాణిజ్య అవసరాలకు ఉపయోగించడంతో కమర్షియల్ ట్యాక్స్ విధించారు. అయితే, దీనిని నివాస గృహంగా మార్చాలని జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ గతంలో కోరారు. కానీ, పన్ను బకాయిలు మాత్రం అలాగే ఉండిపోయాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వన్ టైమ్ సెటిల్మెంట్’ పథకం మార్చి 31తో ముగిసింది. ఈ పథకం కింద రాయితీ పోను ఇంకా రూ. 82,91,822 బకాయిలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై గత నెలలోనే నోటీసులు జారీ చేసినప్పటికీ సంబంధిత వ్యక్తుల నుంచి స్పందన లేకపోవడంతో, డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు ఏఎంసీ బాల్‌రాజ్ ఆధ్వర్యంలో సిబ్బంది భవనాన్ని సీజ్ చేసి నోటీసులు అంటించారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి, తమిళనాడు ముఖ్యమంత్రిగా చెరగని ముద్ర వేసిన జయలలితను ప్రజలు ‘పురట్చి తలైవి’, ‘అమ్మ’ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. ఆమె సీఎంగా ఉండగానే మరణించారు. జయలలితకు దేశవ్యాప్తంగా పలుచోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు సమాచారం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రీల్స్ సరదా.. నిండు ప్రాణం బలి
అర్ధరాత్రి పంటచేలో మంటలు.. ఏం జరిగిందంటే
దుర్గగుడి సిబ్బంది చేతివాటం.. గోల్డ్ నగలను రోల్డ్ గోల్డ్ పేరిట మళ్లింపు
హైదరాబాద్‌లో ‘గ్యాస్’ సెగ: సెల్ టవర్ ఎక్కిన ఆటో డ్రైవర్లు
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..రూ.10 కోట్లు చూసి మైండ్ బ్లాక్..
రీల్స్ సరదా.. నిండు ప్రాణం బలి
అర్ధరాత్రి పంటచేలో మంటలు.. ఏం జరిగిందంటే
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
కొంప ముంచిన గ్యాస్ బుకింగ్.. భార్యను చంపిన భర్త అరెస్ట్

