ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..రూ.10 కోట్లు చూసి మైండ్ బ్లాక్..
ఉత్తరప్రదేశ్‌లోని ఒక మహిళ బ్యాంక్ ఖాతాలో అనుకోకుండా ₹10 కోట్లు జమ అయ్యాయి. ఏటీఎంలో బ్యాలెన్స్ చూసి షాక్ అయిన ఆమె, ఈ డబ్బు తమది కాదని నిజాయితీగా బ్యాంకుకు తెలియజేసింది. ఇది కేవలం సాంకేతిక లోపమని బ్యాంక్ అధికారులు వివరించారు. ఈ ఘటనలో మహిళ చూపిన నిజాయితీకి సర్వత్రా ప్రశంసలు దక్కాయి.
సామాన్యుల బ్యాంకు ఖాతాల్లో వందలు, వేలు ఉండటం సహజం. ఎకౌంట్‌లో ఓ పదివేల రూపాయలు ఉంటే సామాన్యుడికి అది ఎంతో భరోసాగా ఫీలవుతాడు. అలాంటిది ఓ సామాన్య మహిళ ఎకౌంట్‌లో రూ.10 కోట్లు ఉంటే.. అదికూడా ఆమెకు తెలియకుండా.. సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది ఉత్తరప్రదేశ్‌లో. యూపీకి చెందిన ఒక మహిళ ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేయగా.. స్క్రీన్‌పై కనిపించిన అంకెలు చూసి ఆమె కళ్లు బైర్లు కమ్మాయి. ఏకంగా రూ. 9,99,49,586 ఆమె అకౌంట్‌లో జమ అయ్యాయి. ఉత్తరప్రదేశ్ మైన్‌పురి జిల్లాకు చెందిన ఒక మహిళ… బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా కలిగి ఉంది. కొత్త పిన్ జనరేట్ చేయడానికి, బ్యాలెన్స్ ఎంతో చూసుకోవడానికి ఆమె కుమారుడితో కలిసి ఏటీఎంకు వెళ్లింది. అక్కడ స్క్రీన్‌పై పది కోట్ల రూపాయల బ్యాలెన్స్ చూపించడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. పక్కా రైతు కుటుంబానికి చెందిన వారు కావడంతో, అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాక నేరుగా బ్యాంకుకు పరుగులు తీశారు. ఈ డబ్బు ఎవరిదో తమకు తెలియదని, తమది కాని ఈ డబ్బునుంచి రూపాయి కూడా తమకు అక్కర్లేదని, వెంటనే దీనిని వెనక్కి తీసుకోండి అంటూ ఆ మహిళా తన నిజాయితీని చాటుకుంది. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బ్యాంకు అధికారులు స్పందించారు. ఈ క్రమంలో స్పందించి బ్యాంకు మేనేజర్..ఇది కేవలం సాంకేతిక లోపం మాత్రమేనని స్పష్టం చేశారు. సదరు మహిళకు బ్యాంకులో లోన్ అకౌంట్ ఉందని, సాఫ్ట్‌వేర్ సమస్య వల్ల అలా భారీ మొత్తం చూపిస్తోందని వెల్లడించారు. ఏది ఏమైనా, కోట్లు ఖాతాలో పడితే ఎవరైనా ఆశపడతారు..వెంటనే డ్రాచేసి వాడుకోడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ ఆ మహిళ తన ఎకౌంట్‌లో పడిన డబ్బుపై ఆశపడలేదని, ఆమె నిజాయితీని నెటిజన్లు అభినందిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన ‘నానో బనానా’
ఇంటి బయట నిద్రించిన బాలుడు.. కాటేసిన కట్లపాము, రక్తపింజర.. చివరకు
ఏనుగు అరుపు వినందే.. ఆమెకు నిద్రపట్టదు !
ఆలయంలోని బావిలో అద్భుతం.. చూసి షాకైన గ్రామస్తులు
భూమ్మీద అత్యంత ప్రమాదకరమైన పాము..
భార్య వదిలి వెళ్లిపోయింది.. ‘AI జెమిని’ సలహా ఏంటంటే..
వేసవి వేడికి.. ఏసీ లేకుండానే ఇల్లంతా చల్లగా
ఇన్‌స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులు కూర చేసి తిన్నారు.. ఆ తర్వాత

