AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌

కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌

Phani CH
|

Updated on: Apr 01, 2026 | 6:18 PM

Share

భార్యను హత్య చేసి నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న మాజీ ఆర్మీ కెప్టెన్ సందీప్ తోమర్ చివరకు పట్టుబడ్డాడు. మధ్యప్రదేశ్‌లో ఒక LPG సిలిండర్ బుక్ చేయడంతో పంజాబ్ పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో అతడిని పట్టుకున్నారు. ఎంతటి తెలివైన నేరస్థుడైనా చేసే చిన్న పొరపాటే అతడి పతనానికి కారణమవుతుందనేందుకు ఈ ఘటనే నిదర్శనం.

ఎంతటి తెలివైన నేరస్థుడైనా ఏదో ఒక చిన్న పొరపాటుతో దొరికిపోతాడనే దానికి ఈ ఘటనే నిదర్శనం. భార్యను హత్య చేసి, నాలుగేళ్లుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న ఓ మాజీ ఆర్మీ కెప్టెన్, చివరకు ఒక ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేసి కటకటాల పాలయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని పాండుర్నాలో పంజాబ్ పోలీసులు ఈ ‘కేస్ ఫైల్’ను విజయవంతంగా ఛేజ్ చేశారు. నిందితుడు సందీప్ తోమర్ గతంలో ఆర్మీ కెప్టెన్‌గా పనిచేసేవాడు. 2013లో పంజాబ్‌లోని అబోహర్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో తన భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు. మొదట దీనిని ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ, పోలీసుల లోతైన విచారణలో అసలు నిజం బయటపడింది. దీంతో కోర్టు అతడిని దోషిగా తేల్చి 2014లో జీవితఖైదు విధించింది. శిక్ష అనుభవిస్తున్న తోమర్, 2019లో బెయిల్‌పై బయటకు వచ్చాడు. 2022లో అతడి అప్పీలును హైకోర్టు కొట్టివేయడంతో తిరిగి లొంగిపోవాల్సి ఉంది. కానీ అప్పటి నుండి తన పేరు, గుర్తింపు, లొకేషన్లు మారుస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. పంజాబ్ పోలీసులు ఇతని కోసం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేశారు. పోలీసుల నిఘాలో నిందితుడి పాన్ కార్డుతో అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతా చిక్కింది. ఈ ఖాతా ద్వారా మధ్యప్రదేశ్‌లోని పాండుర్నాలో ఒక గ్యాస్ సిలిండర్ బుక్ చేసినట్లు టెక్నికల్ టీమ్ గుర్తించింది. వెంటనే గ్యాస్ ఏజెన్సీ ద్వారా అడ్రస్ సేకరించిన పోలీసులు, మెరుపు దాడి చేసి తోమర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కోర్టు అతడిని జ్యుడిషియల్ కస్టడీకి పంపింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో

మన్యం లో 20 అడుగుల ‘కింగ్ కోబ్రా’.. వణికిపోయిన గ్రామస్తులు

అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ

మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం

విజయ్‌‌‌కు రూ.600 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్ల మధ్య టీవీఎస్‌ మోపెడ్‌

Follow Us