AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు

మన్యం లో 20 అడుగుల ‘కింగ్ కోబ్రా’.. వణికిపోయిన గ్రామస్తులు

Phani CH
|

Updated on: Apr 01, 2026 | 5:50 PM

Share

పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం వత్తాడలో 20 అడుగుల భారీ కింగ్ కోబ్రా కలకలం రేపింది. పొలాల్లో కనిపించిన ఈ పెద్ద పామును చూసి భయపడిన గ్రామస్తులు కర్రలతో కొట్టి చంపేశారు. అయితే అరుదైన వన్యప్రాణులను చంపడంపై వన్యప్రాణి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అటవీశాఖ అధికారులు తమకు రక్షణ కల్పించాలని వత్తాడ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం మండలంలో భారీ కింగ్ కోబ్రా కలకలం సృష్టించింది. వత్తాడ గ్రామ పరిసరాల్లో సుమారు 20 అడుగుల పొడవు ఉన్న ఈ భారీ సర్పం ప్రత్యక్షం కావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అంత పెద్దపామును కళ్లముందు చూసి ఏం చేయాలో తెలియక అందరూ అటూ ఇటూ పరుగెత్తారు. చివరికి అందరూ కలిసి పామును కర్రలతో కొట్టి చంపేశారు. వత్తాడ గ్రామానికి చెందిన గిరిజన రైతులు ఎప్పటిలాగే ఉదయం పోడు వ్యవసాయం కోసం పొలాలకు వెళ్తుండగా, పొదల్లో కదులుతున్న భారీ ఆకారాన్ని చూసి నిర్ఘాంతపోయారు. సాధారణంగా రెండు మూడు అడుగుల పాములను చూసే రైతులకు, ఏకంగా 20 అడుగుల కింగ్ కోబ్రా కనిపించడంతో ముచ్చెమటలు పట్టాయి. ప్రాణభయంతో వారు గ్రామంలోకి పరుగులు తీశారు. ఈ వార్త గ్రామమంతా వ్యాపించడంతో గ్రామస్తులంతా అక్కడికి చేరుకున్నారు. పొదల్లో అంత పెద్ద పామును చూసిన గ్రామస్తులు పిల్లలు, పశువుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని భావించారు. ఆత్మరక్షణ కోసం చేసేది లేక ఆ భారీ సర్పాన్ని హతమార్చారు. పాము మృతితో గ్రాస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ, వన్యప్రాణి ప్రేమికులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరుదైన వన్యప్రాణులను చంపడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని, ఇలాంటి సమయాల్లో అటవీ శాఖకు లేదా స్నేక్ క్యాచర్లకు సమాచారం ఇవ్వాలని వారు సూచిస్తున్నారు. అడవులకు సమీపంలో ఉండటం వల్ల తరచూ ఇలాంటి ప్రమాదకర సర్పాలు ఎదురవుతున్నాయని, అటవీ శాఖ అధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని వత్తాడ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ

మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం

విజయ్‌‌‌కు రూ.600 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్ల మధ్య టీవీఎస్‌ మోపెడ్‌

Follow Us