AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'

జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన ‘నానో బనానా’

Phani CH
|

Updated on: Apr 01, 2026 | 6:20 PM

Share

విదేశీ పర్యటనల్లో భాషా సమస్య సాధారణం. జపాన్‌లోని ఓ హోటల్‌లో అమెరికన్ పర్యాటకుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. AC రిమోట్‌పై జపనీస్ అక్షరాలు అర్థం కాక ఇబ్బంది పడ్డాడు. తన ఫోన్‌లోని గూగుల్ AI 'నానో బనానా 2' తో రిమోట్ ఫోటో తీసి ఇంగ్లీష్‌లోకి అనువదించుకున్నాడు. AI సహాయంతో భాషా అడ్డంకులను ఎలా అధిగమించవచ్చో ఈ సంఘటన నిరూపిస్తుంది.

విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఎదురయ్యే అతిపెద్ద సమస్య భాష. బోర్డులు, మెనూలు, చివరకు ఎలక్ట్రానిక్ వస్తువుల రిమోట్లపై ఉండే అక్షరాలు అర్థం కాక పర్యాటకులు తలలు పట్టుకుంటారు. సరిగ్గా ఇలాంటి వింత అనుభవమే జపాన్ వెళ్ళిన ఒక అమెరికన్ టూరిస్ట్‌కు ఎదురైంది. జపాన్‌లోని ఒక హోటల్‌లో బస చేసిన ఆ పర్యాటకుడు, తెల్లవారుజామున 4 గంటలకు విపరీతమైన ఉక్కపోతతో నిద్రలేచాడు. ఏసీ టెంపరేచర్ తగ్గిద్దామని రిమోట్ తీస్తే, దానిపై ఉన్న బటన్లన్నీ జపనీస్ భాషలో ఉన్నాయి. ఏ బటన్ నొక్కితే ఏమవుతుందో తెలియక కొద్దిసేపు అయోమయానికి గురయ్యాడు. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. తన ఫోన్‌లోని గూగుల్ ఏఐ టూల్ ‘నానో బనానా 2’ సహాయం కోరాడు. ఆ జపనీస్ రిమోట్‌ను ఫోటో తీసి స్కాన్ చేయడమే కాకుండా, “దీనిని ఇంగ్లీష్‌లోకి మార్చిన రిమోట్ ఫోటో నాకు ఇవ్వు” అని అడిగాడు. ఆ ఏఐ టూల్ సెకన్ల వ్యవధిలోనే ఆ రిమోట్‌లోని టెంపరేచర్, ఫ్యాన్ స్పీడ్, మోడ్ సెట్టింగ్‌లను విశ్లేషించి, అచ్చు గుద్దినట్లు ఇంగ్లీష్ అక్షరాలు ఉన్న రిమోట్ ఇమేజ్‌ను సృష్టించి ఇచ్చింది. ఆ ఫోటో ఆధారంగా ఏసీ సెట్టింగ్స్ మార్చుకున్న పర్యాటకుడు, హాయిగా నిద్రపోయాడు. “సమయానికి నానో బనానా నన్ను కాపాడింది” అంటూ ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌

వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో

మన్యం లో 20 అడుగుల ‘కింగ్ కోబ్రా’.. వణికిపోయిన గ్రామస్తులు

అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ

మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం

Follow Us