AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో ‘గ్యాస్’ సెగ: సెల్ టవర్ ఎక్కిన ఆటో డ్రైవర్లు

హైదరాబాద్‌లో ‘గ్యాస్’ సెగ: సెల్ టవర్ ఎక్కిన ఆటో డ్రైవర్లు

Phani CH
|

Updated on: Apr 01, 2026 | 7:24 PM

Share

నగరంలో ఆటో ఎల్‌పీజీ, సీఎన్‌జీ గ్యాస్ కొరత తీవ్రమైంది. గ్యాస్ దొరకక ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లు నిరసనలకు దిగారు. అత్తాపూర్, శివరాంపల్లి వద్ద డ్రైవర్లు టవర్ ఎక్కి, గ్యాస్ ధరలు పెరగడం, లభ్యత లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలే దీనికి కారణం. తక్షణమే గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని డ్రైవర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు.

నగరంలో ఆటో ఎల్పీజీ , సీఎన్జీ గ్యాస్ కొరత తీవ్రరూపం దాల్చింది. గ్యాస్ దొరకక ఉపాధి కోల్పోతున్నామంటూ ఆటో డ్రైవర్లు చేపట్టిన నిరసన అత్తాపూర్ ప్రాంతంలో ఉద్రిక్తతకు దారితీసింది. రాజేంద్రనగర్ శివరాంపల్లి సబ్‌స్టేషన్ వద్ద ముగ్గురు ఆటో డ్రైవర్లు—సాయి, అబ్దుల్, మరోవ్యక్తి ఎల్పీజీ దొరకడం లేదని ఆవేదనతో ఏకంగా సెల్ టవర్ ఎక్కారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడ్డా కేవలం రూ. 500 విలువైన గ్యాస్ మాత్రమే ఇస్తున్నారని, అది తమ రోజువారీ తిరుగుడుకు ఏమాత్రం సరిపోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రూ. 60 ఉన్న గ్యాస్ ధర ఇప్పుడు కొన్ని చోట్ల రూ. 100కు చేరడంపై డ్రైవర్లు మండిపడుతున్నారు. నిరసన జరుగుతున్న సమయంలో అటుగా వెళ్తున్న మరో ఆటో డ్రైవర్‌పై నిరసనకారులు దాడికి దిగారు. యూనియన్ సభ్యుడిగా ఉండి నిరసనకు మద్దతు తెలపకుండా ఆటో నడుపుతున్నాడనే నెపంతో దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న స్థానిక డిసిపి పై కూడా కొందరు ఆటో డ్రైవర్లు ఆవేశంతో తిరగబడ్డారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై గుంపును చెదరగొట్టారు. టవర్ ఎక్కిన వారిని కిందకు దించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీని ప్రభావం హైదరాబాద్‌లోని ఆటో డ్రైవర్లు, హోటళ్లు, గృహాలపై తీవ్రంగా ప్రభావం పడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..రూ.10 కోట్లు చూసి మైండ్ బ్లాక్..

ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్

ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే

జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన ‘నానో బనానా’

కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌

Follow Us