AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రీల్స్‌ సరదా.. నిండు ప్రాణం బలి

రీల్స్‌ సరదా.. నిండు ప్రాణం బలి

Phani CH
|

Updated on: Apr 01, 2026 | 7:31 PM

Share

ప్రస్తుత కాలంలో రీల్స్ మోజు పెరిగి, ప్రాణాల మీదకు తెస్తోంది. తిరుపతిలో తాజాగా అలాంటి విషాద ఘటనే జరిగింది. ఐదో అంతస్తులో రీల్స్ తీస్తుండగా ప్రమాదవశాత్తూ పడి ఓ బాలిక మరణించింది. లైకులు, కామెంట్ల కోసం చేసే సాహసాలు తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగుల్చుతున్నాయి. సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తలు, పిల్లల భద్రతపై అవగాహన ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.

ప్రస్తుత కాలంలో జనాల్లో రీల్స్‌ పిచ్చి బాగా పెరిగిపోయింది. చిన్నపెద్దా తేడాలేకుండా అందరూ రీల్స్‌ కోసం చేసే ప్రయత్నాలు వారి ప్రాణాలమీదకు తెస్తున్నాయి. కొన్నిసందర్భాల్లో ప్రాణాలే పోతున్నాయి. లైకులు, కామెంట్ల కోసం చేసే సాహసాలు కన్నవారికి కడుపుకోతను మిగుల్చుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే తిరుపతిలో జరిగింది. నేపాల్‌కు చెందిన ధను బహదూర్ కుటుంబం ఉపాధి కోసం తిరుపతికి వలస వచ్చింది. కరకంబాడి రోడ్డులోని ‘సాయి నివాస్’ అపార్ట్‌మెంట్‌లో బహదూర్ వాచ్‌మెన్‌గా పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నాడు. ఆయన కుమార్తె పుష్పకు సోషల్ మీడియాలో రీల్స్ చేయడం అంటే మహా సరదా. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం రీల్స్ చేస్తూ అపార్ట్‌మెంట్ 5వ అంతస్తుపైకి వెళ్లింది. ప్రమాదవశాత్తూ అదుపు తప్పి పైనుంచి కింద పడిపోయింది. చాలా సేపటి వరకు కూతురు కనిపించకపోవడంతో తల్లి కాజల్ అంతటా వెతికింది. చివరికి అపార్ట్‌మెంట్ కింద రక్తపు మడుగులో పడి ఉన్న పుష్పను చూసి ఆ తల్లి గుండె పగిలిపోయింది. ఐదో అంతస్తు నుండి పడటంతో తలకు తీవ్ర గాయమై, కాళ్లు చేతులు విరిగి బాలిక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అలిపిరి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రుయా ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో ఎప్పుడూ సందడిగా తిరిగే కుమార్తె విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అర్ధరాత్రి పంటచేలో మంటలు.. ఏం జరిగిందంటే

దుర్గగుడి సిబ్బంది చేతివాటం.. గోల్డ్ నగలను రోల్డ్ గోల్డ్ పేరిట మళ్లింపు

హైదరాబాద్‌లో ‘గ్యాస్’ సెగ: సెల్ టవర్ ఎక్కిన ఆటో డ్రైవర్లు

ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..రూ.10 కోట్లు చూసి మైండ్ బ్లాక్..

ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్

Follow Us