సర్పంచ్ ఇంట్లో వింత శబ్ధాలు.. వెళ్లిచూడగా షాకైన కుటుంబం
అనకాపల్లి జిల్లా ద్వారకానగర్‌లో 12 అడుగుల భారీ గిరినాగు సర్పంచ్ ఇంట్లోకి చొరబడి కలకలం రేపింది. కుటుంబసభ్యులు భయంతో పరుగులు తీయగా, స్థానిక స్నేక్ క్యాచర్ వెంకటేష్ ధైర్యంగా పామును రెండు గంటల్లో బంధించారు. గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం అటవీ శాఖ అధికారుల సమక్షంలో కింగ్ కోబ్రాను సురక్షితంగా రిజర్వ్ ఫారెస్ట్‌లో విడిచిపెట్టారు.
అనకాపల్లి జిల్లా వి.మాడుగుల మండలం ద్వారకానగర్‌లో మంగళవారం భారీ గిరినాగు కలకలం రేపింది. గ్రామ సర్పంచ్ నాయుడు ఇంట్లోకి చొరబడి ఆ ఇంట్లోనివారిని పరుగులు పెట్టించింది. సర్పంచ్ నాయుడు ఇంట్లో అందరూ తమ పనుల్లో ఉండగా ఒక్కసారిగా ఇంట్లో వింత శబ్దాలు వినిపించాయి. ఏమై ఉంటుందా అని లోపలికి వెళ్లి చూడగా, సుమారు 12 అడుగుల పొడవైన భారీ గిరినాగు పడగ విప్పి కనిపించడంతో వారు షాక్‌కు గురయ్యారు. అంత పెద్ద పామును చూసి భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. ఈ విషయం తెలియగానే చుట్టుపక్కల వారు కూడా భారీగా తరలివచ్చారు. వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్ వెంకటేష్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వెంకటేష్, ప్రాణాలకు తెగించి సుమారు రెండు గంటల పాటు శ్రమించి ఆ భారీ గిరినాగును చాకచక్యంగా బంధించారు. అంత పెద్ద పాము పట్టుబడటంతో సర్పంచ్ కుటుంబంతో పాటు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం అటవీ శాఖ అధికారుల సమక్షంలో ఆ కింగ్ కోబ్రాను సురక్షితంగా సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో విడిచిపెట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jayalalithaa: హైదరాబాద్‌లోని జయలలిత భవనం సీజ్.. కారణం ఇదే
రీల్స్ సరదా.. నిండు ప్రాణం బలి
అర్ధరాత్రి పంటచేలో మంటలు.. ఏం జరిగిందంటే
దుర్గగుడి సిబ్బంది చేతివాటం.. గోల్డ్ నగలను రోల్డ్ గోల్డ్ పేరిట మళ్లింపు
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

