AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పర్యాటకమా ?? ప్రాణ సంకటమా ?? భద్రతా ప్రమాణాలు లేవు

పర్యాటకమా ?? ప్రాణ సంకటమా ?? భద్రతా ప్రమాణాలు లేవు

Phani CH
|

Updated on: Apr 01, 2026 | 7:50 PM

Share

మూలపాడు రిజర్వ్ ఫారెస్ట్‌లోని సీతాకోకచిలుకల పార్క్ జిప్ లైన్ కనీస భద్రతా ప్రమాణాలు లేకుండా నడుస్తోంది. ఎత్తైన కొండ ప్రాంతంలో రక్షణ కంచెలు, హ్యాండ్రైల్స్ లేవు. హెచ్చరిక బోర్డులు, నాణ్యమైన పరికరాలు, సరైన సూచనలు కొరవడటంతో పర్యాటకులు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. చిన్నపిల్లలతో వచ్చే కుటుంబాలు భయంతో వెనుతిరుగుతున్నాయి. అటవీశాఖ వెంటనే స్పందించి భద్రతా చర్యలు చేపట్టకుంటే, ఈ పార్క్ ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.

ప్రకృతి ఒడిలో సేదతీరాలని వచ్చే పర్యాటకులకు ఎన్టీఆర్ జిల్లా మూలపాడు రిజర్వ్ ఫారెస్ట్‌లోని సీతాకోకచిలుకల పార్క్ ఇప్పుడు భయం పుట్టిస్తోంది. అడ్వెంచర్ పేరుతో ఇక్కడ నిర్వహిస్తున్న ‘జిప్ లైన్’ కనీస భద్రతా ప్రమాణాలు లేకుండా సాగుతోందని, ఇది పర్యాటకుల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బయటకు అందమైన ప్రకృతి ఆవరణలా కనిపిస్తున్నా, లోపల మాత్రం ప్రమాదాల గూడుగా మారిందని సందర్శకులు వాపోతున్నారు. ముఖ్యంగా జిప్ లైన్ ప్రారంభమయ్యే ఎత్తైన కొండ ప్రాంతంలో కనీస రక్షణ ఏర్పాట్లు లేవు. ఒక అడుగు తప్పినా నేరుగా లోయల్లోకి జారిపోయే ప్రమాదం ఉన్నా, అక్కడ రక్షణ కంచెలు గానీ, పట్టుకోవడానికి హ్యాండ్రైల్స్ గానీ లేవు. ప్రమాదకర ప్రాంతాల వద్ద పర్యాటకులను అప్రమత్తం చేసే ఒక్క హెచ్చరిక బోర్డు కూడా ఇక్కడ కనిపించకపోవడం గమనార్హం. జిప్ లైన్ కోసం వాడుతున్న పరికరాల నాణ్యతపై పర్యాటకుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బంది సరైన సూచనలు ఇవ్వకపోవడం పరిస్థితిని మరింత భయానకంగా మారుస్తోంది. వీకెండ్ రోజుల్లో ఇక్కడికి పెద్దసంఖ్యలో పర్యాటకులు తరలివస్తుంటారు. చిన్నపిల్లలతో వచ్చే కుటుంబాలు భద్రతా లోపాలను చూసి భయంతో వెనుదిరుగుతున్నాయి. ఒక్క చిన్న పొరపాటు జరిగినా అది పెను విషాదానికి దారితీసే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించి, పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో ఈ అడ్వెంచర్ పార్క్ మృత్యుకూపంగా మారే ప్రమాదం ఉందని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సర్పంచ్ ఇంట్లో వింత శబ్ధాలు.. వెళ్లిచూడగా షాకైన కుటుంబం

Jayalalithaa: హైదరాబాద్‌లోని జయలలిత భవనం సీజ్‌.. కారణం ఇదే

రీల్స్‌ సరదా.. నిండు ప్రాణం బలి

అర్ధరాత్రి పంటచేలో మంటలు.. ఏం జరిగిందంటే

దుర్గగుడి సిబ్బంది చేతివాటం.. గోల్డ్ నగలను రోల్డ్ గోల్డ్ పేరిట మళ్లింపు

Follow Us