New Finance Rules: క్రెడిట్ కార్డుల నుంచి పాన్ కార్డు వరకు.. నేటి నుంచి మారిన రూల్స్.. కొత్త నిబంధనలు తెలుసుకోకపోతే మీకే ప్రాబ్లం..
మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. లేదా డెబిట్ కార్డు యూజ్ చేస్తున్నారా.. ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారా.. అయితే ఏప్రిల్ 1 నుంచి అనేక రూల్స్ మారాయి. వీటి గురించి మీరు ముందే తెలుసుకోకపోతే నస్టపోవాల్సి ఉంటుంది. అవేంటో ఒకసారి చూద్దాం.

ఏప్రిల్ 1 వచ్చిందంటే చాలు.. కొత్త ఆర్ధిక సంవత్సరం వచ్చేసినట్లు. దీంతో అనేక ఆర్దిక మార్పులు అమల్లోకి వస్తుంటాయి. ఎప్పటిలాగే ఈ సారి కూడా అనేక మార్పులు, సవరణలు వచ్చేశాయి. ట్యాక్స్ చెల్లింపులు, క్రెడిట్ కార్డులు, బ్యాంక్ కస్టమర్లు, డిజిటల్ చెల్లింపులు చేసేవారిని ప్రభావితం చేసే అనేక రూల్స్ వచ్చేశాయి. వీటి గురించి అందరూ తెలుసుకోవాల్సిందే. నేటి నుంచి మారనున్న రూల్స్, నియమాలు ఏంటో ఇందులో చూద్దాం.
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నారా..?
మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వాడుతుంటే ముఖ్యమైన మార్పు వచ్చేసింది. రివార్డ్స్ రిడెంప్షన్ విధానంలో ఎస్బీఐ మార్పులు చేసింది. స్టేట్ మెంట్ క్రెడిట్ కోసం రివార్డ్ పాయింట్ల రిడెంప్షన్‌ను 60 వేల పాయింట్లకు పరిమితం చేసింది. 4 వేల పాయింట్ల గుణిజాలలో మాత్రమే స్టేట్ మెంట్ క్రెడిట్‌గా మార్చుకునే అవకాశం ఉంటుంది.
హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం నిబంధనలు
ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏటీఎం నిబంధనల్లో మార్పులు చేసింది. ఉచిత లావాదేవీలు పూర్తయ్యాక చేసే ఏటీఎం లావాదేవీలకు ఛార్జీలను పెంచింది. ఉచిత లిమిట్ పూర్తయ్యాక ప్రతీ ట్రాన్సాక్షన్‌కు రూ.23 చెల్లించాల్సి ఉంటుంది. ఇక యూపీఐ ఆధారిత కార్డ్ లెస్ విత్ డ్రా సదుపాయాన్ని కూడా ఏటీఎం ఉచిత లావాదేవీల కోటాలో చేర్చింది.
లాంజ్ యాక్సెస్ కట్
ఇక పలు రకాల రూపే డెబిట్ కార్డులపై ఉచిత లాంచ్ యాక్సెస్ సదుపాయాన్ని తొలగించింది. దేశీయ, అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల్లో ఉచితంగా అందించే లాంజ్ యాక్సెస్‌ను నిలిపివేసింది.
ఫాస్టాగ్ వార్షిక పాస్ ధర పెంపు
ఇక ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలను నేషనల్ హైవేస్ ఆఫ్ ఇండియా పెంచింది. మొన్నటివరకు రూ.3 వేలు ఉండగా.. ఇప్పుడు రూ.3,075కి పెంచింది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది.
కొత్త ఐటీ చట్టం
నేటి నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 అమల్లోకి వచ్చింది. జీతం పొందేవారికి అనేక ముఖ్యమైన అంశాలు మారాయి. బెంగళూరు, పుణె, హైదరాబాద్, అహ్మదాబాద్ వంటి నగరాల్ల ఉంటున్నవారు కూడా హెచ్‌ఆర్‌ఏ ట్యాక్స్ మినహాయింపులు 50 శాతం పొందవచ్చు.
పాన్ కార్డు రూల్స్
ఇక పాన్ కార్డు దరఖాస్తు నియమాలు కూడా మారాయి. ఇప్పటివరకు పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆధార్ ఒక్కటే సమర్పిస్తే సరిపోయేది. కానీ ఏప్రిల్ 1 నుంచి పాన్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్ కార్డుతో పాటు డేట్ ఆఫ్ బర్త్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ లాంటి ఇతర ధృవీకరణ పత్రాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది.
