AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది గమనించారా..?మాల్స్‌లోకి వెళ్లగానే గాలి ఎందుకు అంత బలంగా వస్తుంది! అసలు రహస్యం ఇదే

మనం ఏదైనా పెద్ద మాల్, సూపర్ మార్కెట్ లేదా విలాసవంతమైన హోటల్‌లోకి ప్రవేశించినప్పుడు, గేటు దగ్గరే జుట్టు చెదిరిపోయేలా గాలి బలంగా మన ముఖానికి తగులుతుంది. ఇది సహజంగా వచ్చే గాలి కాదు, దీనిని ఒక యంత్రం ద్వారా కావాలనే పంపిస్తారు. షాపింగ్ మాల్స్‌లోకి ప్రవేశించగానే మనకు ఒక్కసారిగా గాలి బలంగా తగిలినట్లు (Air Blast) అనిపించడానికి శాస్త్రీయ, సాంకేతిక కారణాలు ఇక్కడ ఉన్నాయి. అసలు ఈ గాలిని ఎందుకు వదులుతారు.. దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటో ఇక్కడ చూద్దాం..

ఇది గమనించారా..?మాల్స్‌లోకి వెళ్లగానే గాలి ఎందుకు అంత బలంగా వస్తుంది! అసలు రహస్యం ఇదే
Air Curtain In Malls
Jyothi Gadda
|

Updated on: Apr 01, 2026 | 5:33 PM

Share

చాలామంది షాపింగ్ మాల్స్ లేదా పెద్ద షోరూమ్‌లలోకి వెళ్లగానే ద్వారం వద్ద గాలి వేగంగా మనపైకి వచ్చినట్లు గమనిస్తారు. దీనిని ఏదో అనుకోకుండా వచ్చే గాలి అని అనుకుంటాం. కానీ, దీని వెనుక ఒక ప్రత్యేకమైన పరికరం ఉంటుందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. దానిని ఎయిర్ కర్టెన్ (Air Curtain) అని పిలుస్తారు. మాల్స్ లోపల ఉండే ఏసీ చల్లదనం బయటకు పోకుండా, బయట ఉండే వేడి గాలి, దుమ్ము, ధూళి, కీటకాలు లోపలికి రాకుండా ఇది ఒక అదృశ్య గోడలా పనిచేస్తుంది.

ఎయిర్ కర్టెన్ అంటే ఏమిటి?:

మాల్స్ ద్వారాల పైన అమర్చబడే యంత్రాన్నే ఎయిర్ కర్టెన్ అంటారు. ఈ ఎయిర్ కర్టెన్ పై నుండి కిందికి గాలిని వేగంగా పంపిస్తూ ఒక ఒత్తిడిని సృష్టిస్తుంది. ఇది పై నుండి కిందికి అత్యంత వేగంతో గాలిని ప్రసరిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే, ఇది గాలితో నిర్మించిన ఒక అదృశ్య ద్వారం (Invisible Door) లాంటిది. అంతేకాదు.. దీని వల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

దీనివల్ల కలిగే ఉపయోగాలు:

చల్లదనాన్ని కాపాడటం: మాల్స్ లోపల సెంట్రలైజ్డ్ ఏసీ ఉంటుంది. తలుపులు తెరిచినప్పుడు లోపల ఉండే చల్లని గాలి బయటకు వెళ్ళిపోకుండా, బయట ఉండే వేడి గాలి లోపలికి రాకుండా ఈ ఎయిర్ కర్టెన్ అడ్డుకుంటుంది.

కాలుష్యం నుండి రక్షణ: రోడ్ల మీద ఉండే దుమ్ము, ధూళి, పొగ వంటివి లోపలికి ప్రవేశించకుండా ఇది రక్షణ కల్పిస్తుంది. ఫలితంగా మాల్ లోపల వాతావరణం ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది.

కీటకాల నివారణ: ఈ గాలి వేగం చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఈగలు, దోమలు వంటి కీటకాలు ఈ గాలి గోడను దాటి లోపలికి రాలేవు.

విద్యుత్ ఆదా: లోపల చల్లదనం స్థిరంగా ఉండటం వల్ల ఏసీ యంత్రాలపై ఒత్తిడి తగ్గుతుంది. ఇది విద్యుత్ ఆదాకు దోహదపడుతుంది.

మాల్స్ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి కాబట్టి, భౌతికమైన తలుపులు వేయడం కంటే ఇలా గాలితో తలుపులు సృష్టించడం వల్ల కస్టమర్ల రాకపోకలకు ఇబ్బంది ఉండదు. లోపలి వాతావరణం చెడిపోదు. అందుకే మాల్స్‌లోకి వెళ్ళినప్పుడు ఆ గాలి మనపై బలంగా పడుతుంది.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us