OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలోనూ టాప్ రేటింగ్ సినిమా
సైకో థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు క్షణ క్షణం ఉత్కంఠభరితంగా థ్రిల్లింగ్ గా సాగుతుంటాయి. అందుకే ఆడియెన్స్ వీటిని చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు అలాంటి మూవీ లవర్స్ కోసమే ఓ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

ఓటీటీలో కొత్త సినిమాల సందడి మొదలైపోయింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడం, తమిళం తదితర భాషలకు చెందిన స్ట్రెయిట్ అండ్ డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. ఇందులో భాగంగానే మంగళవారం (మార్చి 31) ఒక ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమా ఫిబ్రవరి 27, 2026న థియేటర్లలో రిలీజైంది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఆద్యంతం ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, ఊహకు అందని ట్విస్టులు ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్ అందించాయి. నేటి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డీప్‌ఫేక్ వల్ల వచ్చే ప్రమాదాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. అందుకే కేవలం రూ.378 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1714 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇంతకీ ఈ సినిమా ఏదనుకుంటున్నారా? హాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంఛైజీ సిరీస్ లో స్క్రీమ్ కూడా ఒకటి. హారర్ థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఈ సిరీస్ లో ఇప్పటికే ఏడు సినిమాలు వచ్చాయి. అలా ఫిబ్రవరి 27న స్క్రీమ్ 7 సినిమా థియేటర్లలో రిలీజై ఆడియెన్స్ ను బాగా భయపెట్టింది. గతంలో వచ్చిన సినిమాల కంటే మరింత భయంకరంగా, ఆధునిక సాంకేతికతను జోడించి ఈ సినిమాను రూపొందించారు.
కెవిన్ విలియమ్సన్ తెరకెక్కించిన స్క్రీమ్ 7 సినిమాలో క్యాంప్ బెల్, ఇసాబెల్, జాస్మిన్, మేసన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా కథను అర్థం చేసుకోవాలంటే గతంలో వచ్చిన సినిమాలు చూసి ఉండాలి. స్క్రీమ్ 7 కథ కూడా లాస్ట్ సినిమా ఎండింగ్ నుంచే మొదలవుతుంది. గత గత సినిమాల్లో ప్రాణాలతో బయటపడిన సిడ్నీ ప్రెస్కాట్, ఇప్పుడు తన కూతురు టాటమ్‌ను కాపాడుకోవడానికి చేసే పోరాటమే ఈ చిత్రం. గతం గురించి పట్టించుకోకుండా సిడ్నీ ప్రెస్కాట్ ఇప్పుడు ఒక కాఫీ షాప్ నడుపుకుంటూ ప్రశాంతంగా జీవిస్తుంటుంది. అయితే, వుడ్స్‌బోరో హత్యల నిందితుడు స్టుమాచర్ తిరిగి వస్తాడు. సిడ్నీ కూతురు టాటమ్‌ను టార్గెట్ చేస్తూ వరుస హత్యలు జరుగుతాయి. అయితే ఈ హత్యలు చేస్తోంది నిజమైన స్టుమాచర్ కాదు, డీప్‌ఫేక్ (Deepfake) టెక్నాలజీని వాడుతున్న ఒక ఐటీ ఎక్స్ పర్ట్ మార్కో, సిడ్నీ పక్కింటి ఆవిడ జెస్సికా అని తేలుతుంది. మరి చివరికి సిడ్నీ తన తెలివితేటలతో, కూతురిని ఎలా కాపాడుకుంది? విలన్లను ఎలా మట్టుబెట్టిందన్నదే ఈ సినిమా కథ. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ లేదు కానీ ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.
అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..
¿Has escuchado ‘The Kill’ de @stellalefty? Siente la persecución, la emoción, la caza, la muerte 🔪 #Scream7 ¡Ya en cines! pic.twitter.com/Kjq3yuj60T
— Paramount Pictures Spain (@paramount_spain) April 1, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




