AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు నా సినిమాల్లో సైడ్ రోల్స్ చేశాడు.. ఇప్పుడు స్టార్ హీరోగా రాణిస్తున్నాడు.. అది అతని కష్టానికి తగ్గ ఫలితం

సీనియర్ నటుడు వడ్డే నవీన్ ఇప్పుడు తిరిగి సినిమాల్లో రాణిస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు క్రేజీ హీరోగా రాణించిన ఆయన ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవలే వడ్డే నవీన్ నటించిన ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అప్పుడు నా సినిమాల్లో సైడ్ రోల్స్ చేశాడు.. ఇప్పుడు స్టార్ హీరోగా రాణిస్తున్నాడు.. అది అతని కష్టానికి తగ్గ ఫలితం
Vadde Naveen
Rajeev Rayala
|

Updated on: Nov 01, 2026 | 8:26 PM

Share

ఒకప్పుడు టాలీవుడ్‌లో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు వడ్డే నవీన్. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు మరోసారి తన సెకండ్ ఇన్నింగ్స్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ తిరిగి సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన నటించిన ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వడ్డే నవీన్ తన కెరీర్, గత సినిమాలు, హీరో రవితేజ ఎదుగుదలతో పాటు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఒకప్పుడు హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్న వడ్డే నవీన్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు. విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మొన్నామధ్య వడ్డే నవీన్ నటించిన ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన ఇంటర్వ్యూలు ఇస్తూ తన సినీ ప్రయాణానికి సంబంధించిన విషయాలను పంచుకుంటున్నారు. తన కెరీర్‌లో నటించిన ఎన్నో చిత్రాల్లో కొన్ని సినిమాలు తనకు ఎప్పటికీ ప్రత్యేకమని వడ్డే నవీన్ తెలిపారు. ముఖ్యంగా స్నేహితులు, మనసిచ్చి చూడు, నా ఊపిరి చిత్రాలు తనకు ఎంతో ఇష్టమైనవని గుర్తుచేసుకున్నారు. తన కెరీర్‌లో నా ఊపిరి సినిమా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని నవీన్ తెలిపారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిందని పేర్కొన్నారు.

హీరో రవితేజ గురించి మాట్లాడుతూ వడ్డే నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనసిచ్చి చూడు సినిమాలో రవితేజతో కలిసి నటించిన రోజులను గుర్తుచేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన సాధించిన ఎదుగుదల చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. రవితేజ స్టార్ హీరోగా ఎదగడం వెనుక ఎంతో కష్టం ఉందని వడ్డే నవీన్ అభిప్రాయపడ్డారు. కష్టానికి తగిన గుర్తింపు లభించడం వల్లే ఆయన ఈ స్థాయికి చేరుకున్నారని ప్రశంసించారు. అంతటి స్థాయికి ఎదగడం సాధారణ విషయం కాదని పేర్కొన్నారు. రవితేజను ఎప్పుడు కలిసినా ఎంతో ఆప్యాయంగా, స్నేహపూర్వకంగా మాట్లాడతారని నవీన్ తెలిపారు. స్టార్ హీరోగా ఎదిగినప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పు రాలేదని, గతంలో ఎలా ఉండేవారో ఇప్పటికీ అలాగే ఉంటారని వెల్లడించారు. సినీ పరిశ్రమలో అందరితో సానుకూల సంబంధాలు కొనసాగించడం చాలా గొప్ప విషయమని వడ్డే నవీన్ అన్నారు.

ఇవి కూడా చదవండి

Raviteja

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us