AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anushka Shetty: ‘బాహుబలి’లో అనుష్క డూప్ గా నటించిన టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఇప్పుడు ఏం చేస్తోందంటే?

సినిమాల్లో హీరోలకు డూప్ లు నటించడం కామన్. కొన్ని సందర్భాల్లో హీరోయిన్లకు కూడా డూప్ యాక్టర్స్ అవసరమవుతుంది. అలా తెలుగు సినిమాను తలెత్తుకునేలా చేసిన బాహుబలి సినిమాలో అనుష్క పాత్ర కోసం ఓ టాలీవుడ్ హీరోయిన్ డూప్ గా నటించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకుందాం రండి.

Anushka Shetty: 'బాహుబలి'లో అనుష్క డూప్ గా నటించిన టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఇప్పుడు ఏం చేస్తోందంటే?
Anushka Shetty
Basha Shek
|

Updated on: Mar 30, 2026 | 5:57 PM

Share

ప్రభాస్ కు పాన్ ఇండియా సూపర్ స్టార్ గుర్తింపును తీసుకొచ్చిన చిత్రం బాహుబలి. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన ఈ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించాడు. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద కనివినీ ఎరుగని కలెక్షన్లు సాధించింది. ముఖ్యంగా బాహుబలి పార్ట్ 2 అయితే ఇండియన్ బాక్సాఫీస్ రికార్డుల్ని తుడిచేసింది. 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ – 3 భారతీయ సినిమాల్లో నిలిచింది. రాజమౌళి చెక్కిన ఈ కళాఖండంలో చాలా మంది స్టార్స్ నటించారు. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్కా శెట్టి, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు.

బాహుబలి సినిమాలో ప్రభాస్, రానాల పాత్రలకు ఎంత ప్రాధాన్యముందో అనుష్క రోల్ కు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. మొదటి పార్టులో దేవసేనగా బానిస పాత్రలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ రెండో భాగంలో యువరాణిగా తన నటనతో అందరిని మెప్పించింది. రెండు రకాల పాత్రల్లోనూ అనుష్క అద్బుతంగా నటించింది. కాగా ఈ సినిమాలో అనుష్క కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లోనూ నటించింది. రెండో పార్ట్ లో ప్రభాస్ తో కలిసి ఆమె విలన్స్ తో పోరాడే సీన్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే బాహుబలి సినిమాలో ప్రభాస్, రాణాలతో పాటు అనుష్క కోసం కూడా ఒక డూప్ యాక్ట్రెస్ పని చేసిందట. ఆమె కూడా ఒక హీరోయినే .

ఇవి కూడా చదవండి

రుషిక రాజ్ లేటెస్ట్ ఫొటోస్..

బాహుబలిలో అనుష్క శెట్టి పాత్రకు డూప్‌గా నటించిన హీరోయిన్ పేరు రుషిక రాజ్. చూడ్డానికి అచ్చం అనుష్క లాగే ఉంటుందీ ముద్దుగుమ్మ. హైట్, స్కిన్‌టోన్, బాడీ లాంగ్వేజ్‌ కూడా అనుష్కను పోలి ఉండడంతో బాహుబలి సినిమాలో అనుష్క బాడీ డబుల్ గా రుషికను ఎంపిక చేశారు. ఈ బ్యూటీ కూడా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసింది. 2021లో వచ్చిన అశ్మీ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రుషిక రాజ్. దీని తర్వాత కొన్ని సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్టుగానూ చేసింది. ప్రస్తుతం కన్నడ సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటిస్తూ బిజీగా ఉంటోందీ అందాల తార. ఇక రుషిక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఆమె ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us