40 ఏళ్ల వయసులో తగ్గని అందం.. 7 గంటలకల్లా ఆ పని చేయాల్సిందేనట..

Rajitha Chanti

Pic credit - Instagram

01 November 2026

టాలీవుడ్, బాలీవుడ్‌లో తన అద్భుతమైన అభినయంతో పాటు అందంతో ప్రేక్షకులను కట్టిపడేసే హీరోయిన్ అదితి రావు హైదరీ క్రేజ్ గురించి తెలిసిందే.

ప్రస్తుతం ఆమె వయసు 40 సంవత్సరాలు. ఇప్పటికీ పాతికేళ్ల అమ్మాయిల కనిపిస్తుంది. అందుకే ఈ బ్యూటీ ఫిట్నెస్ గురించి తెగ ఆరా తీస్తుంటారు ఫ్యాన్స్.

తాజాగా ఈ అమ్మడు తన గ్లోయింగ్ స్కిన్, ఫిట్‌నెస్, డైట్ రహస్యాల గురించి ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

తాను ఎలాంటి కఠినమైన డైట్లు పాటించనప్పటికీ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తానని, అలాగే తప్పకుండ వ్యాయమాలు చేస్తానని అన్నారు అదితి. 

సూర్యాస్తమయం లోపు, ముఖ్యంగా సాయంత్రం 6:30 నుండి 7:00 గంటల మధ్యే రాత్రి భోజనం ముగించాలని తాను భావిస్తానని.. అలాగే పూర్తి చేస్తానని అన్నారు.

కొన్ని సందర్భాల్లో వరుస షూటింగ్ బిజీ వల్ల వీలు కానీ సమయాల్లో  వీలైనంత తేలికపాటి డిన్నర్ తీసుకోవడానికి ప్రయత్నిస్తానని అదితి చెప్పుకొచ్చింది.

రాత్రి వేళల్లో చేపలు, ప్రాన్ కర్రీ లేదా చికెన్ సూప్ వంటి ప్రోటీన్ ఉండే ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడతానని, ఒకే రకమైన వర్కౌట్లు బోర్ కొడుతుందని అన్నారు.

అందుకే యోగాతో పాటు డ్యాన్స్, కార్డియో వంటి విభిన్న వ్యాయామాలు చేస్తుంటానని ఆమె వెల్లడించారు. చాక్లెట్లు, పానీపూరి తినాలనిపిస్తే తినేస్తానని అన్నారు.