అతడి చేతిలో దారుణంగా మోసపోయా.. అప్పుడే బ్రేకప్ జరిగింది..

Rajitha Chanti

Pic credit - Instagram

01 November 2026

టాలీవుడ్, కోలీవుడ్‌లో తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రెజీనా కాసాండ్రా తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ విషయం పంచుకున్నారు.

ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ, తాజాగా తాను ఎదుర్కొన్న ప్రేమ విఫలం, నమ్మకద్రోహం గురించి ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.

ప్రస్తుతం రెజీనా నటిస్తున్న భారీ చిత్రం 'మూకుతి అమ్మన్ 2' ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఆమె ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన గత ప్రేమ వ్యవహారం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. "2020లో నా చివరి రిలేషన్‌షిప్ ముగిసిందన్నారు. 

ఆ బంధంలో నేను తీవ్రమైన నమ్మకద్రోహానికి గురయ్యాను. ఆ హార్ట్‌బ్రేక్ నన్ను మానసికంగా తీవ్రంగా కుంగదీసింది. ఆ బాధ నుంచి బయటపడటానికి నాకు చాలా సమయం పట్టింది.

ఎంతో నమ్మిన వ్యక్తి మోసం చేయడంతో ఆ మానసిక క్షోభ నుంచి కోలుకోవడం తనకు చాలా కష్టమైందని రెజీనా తెలిపారు. ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 

ఆ చేదు అనుభవం తర్వాత ప్రేమ, డేటింగ్ వంటి అంశాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని, కేవలం తన కెరీర్, నటనపై మాత్రమే పూర్తిగా దృష్టి పెట్టానని స్పష్టం చేశారు.

అయితే తనను మోసం చేసిన ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం ఆమె బయటపెట్టలేదు. ప్రస్తుతం రెజీనా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.