AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: హైదరాబాద్‌లో జరిగిన రియల్ గ్యాంగ్ రేప్ స్టోరీ.. ఓటీటీలోకి లేటెస్ట్ సినిమా.. IMDBలో 8.2 రేటింగ్

నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా తెరకెక్కింది. సమాజంలో జరుగుతున్న ఒక పచ్చి నిజాన్ని ఈ సినిమా ద్వారా మనకు చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాకు ఐఎమ్ డీబీలోనూ 8.2 రేటింగ్ దక్కింది.

OTT Movie: హైదరాబాద్‌లో జరిగిన రియల్ గ్యాంగ్ రేప్ స్టోరీ.. ఓటీటీలోకి లేటెస్ట్ సినిమా.. IMDBలో 8.2 రేటింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Apr 02, 2026 | 7:35 AM

Share

ఈ మధ్యన నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రముఖ వ్యక్తుల జీవిత కథల ఆధారంగా బయోపిక్ లు వస్తున్నాయి. ఆడియెన్స్ కూడా రియల్ స్టోరీలను చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఒక రియల్ స్టోరీనే. 2022లో హైదరాబాద్ లో జరిగిన ఒక రియల్ లైఫ్ గ్యాంగ్ రేప్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. చదువులో టాపర్ అయిన ఓ పెద్దింటి అమ్మాయి ఓరోజు తన మిత్రురాలు ఓ పబ్‌ పార్టీకి పిలవడంతో తల్లిదండ్రుల అనుమతితో ఆ పార్టీకి వెళ్తుంది. అయతే అక్కడ ఆమెకు చేదు అనుభవం ఎదురవుతుంది. డ్రగ్స్‌ మత్తులో కొందరు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడతారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన బంజారా హిల్స్ రేప్‌ కేసు ఆధారంగా స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా పేరు యుఫోరియా. ఫిబ్రవరి 6న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాలో సీనియర్ నటి భూమిక చావ్లా కీలక పాత్ర పోషించింది. అలాగే ధురంధర్, ధురంధర్ 2 సినిమాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సారా అర్జున్ ఈ మూవీలో అత్యాచార బాధితురాలిగా అద్బుతంగా నటించింది. అలాగే విఘ్నేష్, గౌతమ్ మీనన్, రవి ప్రకాశ్, కల్పలత, లిఖిత తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ఫిబ్రవరి 6న థియేటర్‌లో విడుదలైన యుఫోరియా మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఓ మోస్తరుగా ఆడింది. . ముఖ్యంగా భూమిక నటన, యువతను ఆలోచింపజేసే సన్నివేశాలు, క్లైమాక్స్‌ ఈ సినిమాకు ప్లస్‌ పాయింట్ అయ్యాయి. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. యుఫోరియా సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించి అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఏప్రిల్ 03 నుంచి యుఫోరియా సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. శ్రీమతి రాగిణి గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మించిన యుఫోరియా సినిమాకు కాల భైరవ సంగీతం అందించారు. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? అయితే కొద్ది రోజులు ఆగండి. ఎంచెక్కా ఓటీటీలోనే చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

ఈటీవీ విన్ లో యుఫోరియా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us