AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Disco Santhi: ఆస్పత్రిలో ‘ఠాగూర్‌’ సినిమా చూపించారు.. శ్రీహరి మరణంపై సంచలన నిజాలు బయట పెట్టిన డిస్కోశాంతి

హీరోగా, విలన్ గా, సహాయక నటుడిగా వందల సినిమాల్లో నటించారు శ్రీహరి. తన నటనా ప్రతిభకు ఎన్నో పురస్కరాలు, ప్రశంసలు అందుకున్నారు. సినిమాల్లో స్టార్ నటుడిగా ఓ వెలుగు వెలిగిన శ్రీహరి 2013 అక్టోబర్ 09న హఠాత్తుగా కన్నుమూశారు. అప్పటికింకా ఆయన వయసు కేవలం 49 ఏళ్లు మాత్రమే.

Disco Santhi: ఆస్పత్రిలో ‘ఠాగూర్‌’ సినిమా చూపించారు.. శ్రీహరి మరణంపై సంచలన నిజాలు బయట పెట్టిన డిస్కోశాంతి
Srihari, Disco Santhi
Basha Shek
|

Updated on: Mar 30, 2026 | 8:48 PM

Share

శ్రీహరి.. తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అవసరం లేని పేరు. స్టంట్ మాస్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన ఆ తర్వాత నటుడిగా అంచెలంచెలుగా ఎదిగారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, నిర్మాతగా రాణించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ ప్రారంభంలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన శ్రీహరి ఆ తర్వాత ఇతర హీరోల సినిమాల్లోనూ నటించారు. మగధీర, ఢీ, కింగ్, డాన్ శీను, బృందావనం తదితర సూపర్ హిట్ సినిమాల్లో శ్రీహరి పోషించిన పాత్రలకు మంచి పేరొచ్చింది. సినిమాల్లో స్టార్ నటుడిగా ఓ వెలుగు వెలిగిన శ్రీహరి చిన్న వయసులోనే కన్నుమూశారు. ఓ సినిమా షూటింగ్ కోసం ముంబైకి వెళ్లిన ఆయన, తీవ్ర ఆస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. అయితే పరిస్థితి విషమించడంతో 2013 అక్టోబర్ 09న శ్రీహరి తుదిశ్వాస విడిచారు. కాలేయ సంబంధ సమస్యలతో శ్రీహరి చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీహరి సతీమణి డిస్కోశాంతి తన భర్త మరణంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. శ్రీహరికి ముంబైలో కాకుండా హైదరాబాద్ లో చికిత్స చేయించి ఉంటే కచ్చితంగా బతికేవారని ఎమోషనల్ అయ్యింది.

‘ప్రభుదేవా దర్శకత్వంలో ఓ సినిమా (రాంబో రాజ్ కుమార్) షూటింగ్ కోసం శ్రీహరి ముంబైకి వెళ్లారు. షూటింగ్ జరుగుతుండగానే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అక్కడి నుంచి ముంబైలోనే ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. శ్రీహరి చనిపోవడానికి కొద్ది సేపటి ముందు డాక్టర్లు చెకింగ్ కు వచ్చారు. నన్ను బయటకు వెళ్లమని చెప్పారు. కొద్ది సేపటి తర్వాత ఓ నర్సు వచ్చి సెలైన్ బాటిల్ లో ఒక ఇంజెక్షన్ వేసింది. ఇది జరిగిన కొద్ది సేపట్లోనే శ్రీహరి ముక్కు, చెవులు, నోటి వెంట రక్తం వచ్చింది. బ్లడ్ క్లీన్ చేసి, నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. మాట్లాడుతుండగానే శ్రీహరి వాయిస్ లో అయ్యింది. కళ్లు మూతలు పడ్డాయి. వెంటనే డాక్టర్లను పిలిచాను. డ్యూటీ డాక్టర్ వచ్చి చూశారు. మళ్లీ నన్ను వేరే గదికి తీసుకెళ్లారు. శ్రీహరి దగ్గరే ఉంటానన్నా వినిపించుకోలేదు. దీనికి తోడు నాకు హిందీ సరిగ్గా రాక చాలా ఇబ్బందులు పడ్డాను. ఆఖరికి శ్రీహరి చనిపోయిన తర్వాత కూడా నన్ను ఆయన దగ్గకు పోనివ్వలేదు. మీ ఆయనకు ఇంకా చికిత్స చేస్తున్నామని చెప్పి చాలా డబ్బులు కట్టించుకున్నారు. అక్కడి డాక్టర్లు అచ్చం చిరంజీవి ‘ఠాగూర్’ సినిమా చూపించారు. నిజానికి శ్రీహరికి హైదరాబాద్ లో చికిత్స ఇప్పిస్తే బతికే వారు. ముంబైలోని వైద్యులకు శ్రీహరి అంటే ఎవరో తెలియదు. లేదంటే చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. శ్రీహరి రాంగ్ ట్రీట్మెంట్ తోనే చనిపోయాడు. ఆస్పత్రి మీద కేసు పెట్టాలని చాలా మంది చెప్పినా, పిల్లలతో కోర్టుల చుట్టు తిరగలేనని భావించి ఆ ప్రయత్నం మానుకున్నాను’ అని ఎమోషనల్ అయ్యారు డిస్కో శాంతి

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
ఆధ్యాత్మిక భారతం.. ఏ ఆలయం చూసినా కిక్కిరిపోతున్న భక్తజనం..
ఆధ్యాత్మిక భారతం.. ఏ ఆలయం చూసినా కిక్కిరిపోతున్న భక్తజనం..