AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarfaraz Khan: రుతురాజ్, షేక్ రషీద్‌లను కాదని సర్ఫరాజ్‌కే ఛాన్స్.. సెలెక్టర్ల అసలు లెక్క ఇదే

Sarfaraz Khan: సాయి సుదర్శన్ గాయం కారణంగా శ్రీలంక టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌కు సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. రుతురాజ్ గైక్వాడ్, షేక్ రషీద్‌లను కాదని సర్ఫరాజ్‌ను ఎంచుకోవడానికి గల కారణాలు, అతని ఫస్ట్ క్లాస్ రికార్డు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

Sarfaraz Khan: రుతురాజ్, షేక్ రషీద్‌లను కాదని సర్ఫరాజ్‌కే ఛాన్స్.. సెలెక్టర్ల అసలు లెక్క ఇదే
Sarfaraz Khan
Rakesh
|

Updated on: Aug 10, 2026 | 6:10 PM

Share

Sarfaraz Khan: భారత్, శ్రీలంక మధ్య జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‎కు భారత యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ గాయం కారణంగా దూరమయ్యాడు. ప్రస్తుతం అతను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోలుకుంటున్నాడు. అయితే అతని స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై సెలెక్టర్ల మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. ఆశ్చర్యకరంగా ఇండియా-ఎ జట్టులో కూడా లేని సర్ఫరాజ్ ఖాన్‌ను శ్రీలంక పర్యటన కోసం సాయి సుదర్శన్ స్థానంలో వైట్-బాల్ ప్రాతిపదికన సెలక్ట్ చేశారు. సర్ఫరాజ్ ఖాన్ నవంబర్ 2024లో న్యూజిలాండ్‌పై చివరిసారిగా భారత్ తరఫున టెస్ట్ ఆడగా, దాదాపు ఏడాదిన్నర తర్వాత మళ్లీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

రుతురాజ్ గైక్వాడ్‌ను పక్కన పెట్టడానికి కారణాలు

నెల రోజుల క్రితం వరకు సాయి సుదర్శన్‌కు ప్రత్యామ్నాయంగా మిడిల్ ఆర్డర్ కోసం రుతురాజ్ గైక్వాడ్ నంబర్-1 ఛాయిస్‌గా ఉన్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం వెల్లడించింది. అయితే ఇటీవల జరిగిన ఇండియా-ఎ సిరీస్‌లో రుతురాజ్ ఘోరంగా విఫలమయ్యాడు. ఆ సిరీస్‌లోని మూడు ఇన్నింగ్స్‌లలో అతను వరుసగా 22, 1, 13 పరుగులు మాత్రమే చేశాడు. ఈ వరుస వైఫల్యాల కారణంగానే సెలెక్టర్లు రుతురాజ్ వైపు మొగ్గు చూపకుండా, ఇండియా-ఎ జట్టు బయట ఉన్న ఆటగాళ్ల వైపు చూడాల్సి వచ్చింది.

షేక్ రషీద్‌ను కాదని సర్ఫరాజ్ ఖాన్‌కే ప్రాధాన్యత

మరోవైపు ఆంధ్ర యువ బ్యాటర్ షేక్ రషీద్ పేరును కూడా సెలెక్టర్లు తీవ్రంగా పరిశీలించారు. ఇండియా-ఎ తరఫున ఆడిన రషీద్ 45, 63, 20 పరుగులతో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. అయినప్పటికీ శ్రీలంకలోని పిచ్‌లు స్పిన్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. లంక స్పిన్ పరిస్థితుల్లో స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు సాధించగల సత్తా సర్ఫరాజ్ ఖాన్‌కు ఉందని సెలెక్షన్ కమిటీ, టీమ్ మేనేజ్‌మెంట్ నమ్ముతున్నాయి. ఈ ఒక్క కారణమే సర్ఫరాజ్ ఎంపికను ఖరారు చేసింది.

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సర్ఫరాజ్ మైండ్ బ్లోయింగ్ రికార్డ్

దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సర్ఫరాజ్ ఖాన్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. 62 మ్యాచ్‌లు ఆడిన ఈ ముంబై బ్యాటర్ ఏకంగా 64.73 సగటుతో భారీగా పరుగులు సాధించాడు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటివరకు భారత్ తరఫున 6 టెస్టులు ఆడిన సర్ఫరాజ్, 11 ఇన్నింగ్స్‌లలో 37 కంటే ఎక్కువ సగటుతో 371 పరుగులు చేశాడు. స్పిన్‌ను ఎదుర్కొనే నైపుణ్యం, అనుభవం కలగలిసిన సర్ఫరాజ్, శ్రీలంక పర్యటనలో భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాడని మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us