AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

థియేటర్స్ దద్దరిల్లాల్సిందే..! రాజమౌళి మాస్టర్ ప్లాన్.. వారణాసిలో ఆ స్టార్ హీరో కూడా..?

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వారణాసి సినిమా కోసం ఇండియా వైడ్ గా ఉన్న సినీ లవర్స్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను జక్కన్న పాన్ వరల్డ్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

థియేటర్స్ దద్దరిల్లాల్సిందే..! రాజమౌళి మాస్టర్ ప్లాన్.. వారణాసిలో ఆ స్టార్ హీరో కూడా..?
Varanasi
Rajeev Rayala
|

Updated on: Aug 10, 2026 | 3:09 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా వారణాసి. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులతో పాటు యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి గ్లోబల్ రేంజ్ లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో తెలుగు సినిమా సత్తా ప్రపంచ వ్యాప్తంగా మరోసారి చాటి చెప్పనున్నారు రాజమౌళి. వారణాసి సినిమా టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతోందని ఇప్పటికే మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు మూడు నాలుగు గెటప్స్ లో కనిపించనున్నారని తెలుస్తుంది. రాముడి మహేష్ కనిపించనున్నారని ఇప్పటికే రాజమౌళి చెప్పేశారు.

తాజాగా మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు లుక్స్ ను విడుదల చేశారు. యాక్షన్ అడ్వాంచర్ గా తెరకెక్కుతున్న వారణాసి సినిమాలో మహేష్ బాబు రుద్రా అనే పాత్రలో కనిపించనున్నారు. అయితే వారణాసి సినిమాలో రామాయణానికి సంబందించిన సన్నివేశాలను చూపించనున్నారు. ఆ మధ్య విడుదల చేసిన టైటిల్ టీజర్ లోనూ రాముడు కుంభకర్ణుడిని వధించడం చూపించారు. అయితే రాముడు ఉన్నాడు కాబట్టి హనుమంతుడు కూడా ఉంటాడు. దాంతో వారణాసి సినిమాలో హనుమంతుడిగా నటించేది ఎవరు అనే ఆసక్తి మొదలైంది.

ఇవి కూడా చదవండి

అయితే గతంలో వారణాసి సినిమాలో హనుమంతుడిగా మాధవన్ నటిస్తున్నారని ప్రచారం జరిగింది. కాగా ఇప్పుడు మరో హీరో పెను బయటకు వచ్చింది. ఆయన ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. చరణ్ వారణాసి సినిమాలో హనుమంతుడిగా నటించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఇటీవల విడుదలైన పెద్ది సినిమాలో ఓ యాక్షన్ సీన్ లో గద పట్టుకున్న చరణ్ అచ్చం హనుమంతుడిలా అనిపించాడు. అది నచ్చే ఇప్పుడు వారణాసి సినిమాలో చరణ్ ను హనుమంతుడిగా జక్కన్న చూపించనున్నారని సోషల్ మీడియాలో ఒకటే గుసగుస వినిపిస్తుంది. అయితే ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తో రాజమౌళి సినిమా చేశారు కాబట్టి చరణ్ వారణాసిలో ఉండే అవకాశం లేకపోలేదు అని కొందరు అంటున్నారు. మరి నిజంగా వారణాసి సినిమాలో రామ్ చరణ్ నటిస్తారా లేదా అన్నది చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us