సూపర్ హిట్ కొట్టిన పట్టించుకోలేదు.. చివరకు ఆటోనే దిక్కైంది..! దీన స్థితిలో నటుడు
ప్రస్తుతం ఓ నటుడి లేటేస్ట్ ఫోటోస్ వైరలవుతున్నాయి. ఒకప్పుడు నటుడిగా పాపులర్ అయిన అతడు.. ఇప్పుడు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సినిమాల్లో అవకాశాలు లేక ప్రస్తుతం ఆటో నటుడపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్ధిక కష్టాలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. తాజాగా ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చిత్రసీమలో చాలా మంది నటులు సున్నా నుండి మొదలుపెట్టి విజయం సాధించారు. కష్టాలను అధిగమించి నటుడిగా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నవారు ఎందరో ఉన్నారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోహీరోయిన్స్ మాత్రమే కాకుండా సహాయ నటీనటులు సైతం ఫేమస్ అవుతుంటారు. ఎన్నో హిట్ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేస్తుంటారు. అద్భుతమైన నటనతో జనాల మనసులలో చెరగని స్థానం సంపాదించుకుంటారు. అగ్ర హీరోలకు ధీటుగా సహజ నటనతో కట్టిపడేసిన నటీనటులు చాలా మంది ఉన్నారు. అయితే సినిమాల్లో నటించిన అందరి లైఫ్ ఒకేలా ఉండదు. కొందరు స్టార్స్ గా రాణిస్తుండగా మరికొందరు మాత్రం సినిమాలు లేక ఆర్థిక ఇబ్బందులతో దీన స్థితిలో కనిపిస్తూ ఉంటారు. అలాంటి వారు చాలా మంది ఉన్నారు. ఇక పైన కనిపిస్తోస్తున్న నటుడిని గుర్తుపట్టారా.? కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ నటుడు.. ఇప్పుడు ఊహించని స్థితిలో కనిపించారు.
ఆయన పేరు మరిముత్తు. 2008లో వచ్చిన సూపర్ హిట్ తమిళ చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’తో తనదైన ముద్ర వేసిన ఈ నటుడికి, ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు కరువయ్యాయి. దీంతో జీవనోపాధి కోసం ఆయన చిన్న చిన్న పనులు, కూలీ పనులు చేయాల్సి వచ్చింది. ఎలక్ట్రికల్ వర్క్, రేడియోలు రిపేర్ చేయడం నుంచి ఆటోరిక్షాలు నడుపుతున్నాడు మరిముత్తు . ఎం. శశికుమార్ దర్శకత్వంలో 2008లో విడుదలైన ‘సుబ్రమణిపురం’ చిత్రం, తమిళ చిత్రసీమలో అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇదే సినిమా తెలుగులో అనంతపురం అనే పేరుతో విడుదలైంది. ఈ చిత్రంలో శశికుమార్, జై, సముద్రకని, స్వాతి, గంజా కరుప్పు అలాగే సూపర్ గుడ్ సుబ్రమణి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రంలో మరిముత్తు కూడా కనిపించి, తన నటనతో ప్రజల దృష్టిని ఆకర్షించారు.
‘సుబ్రహ్మణ్యపురం’ భారీ విజయం సాధించినప్పటికీ, మరిముత్తు నటనారంగంలో అవకాశాలు అందుకోలేపోయాడు. ఈ సినిమా తర్వాత అతనికి కామెడీ, క్యారెక్టర్ పాత్రలు వస్తాయని ప్రజలు ఆశించారు, కానీ అతని అవకాశాలు పరిమితంగానే ఉండిపోయాయి. ఒక కళాకారుడిగా నిలదొక్కుకోవడానికి తాను ఎదుర్కొన్న కష్టాల గురించి మరిముత్తు తర్వాత బహిరంగంగా మాట్లాడారు. సినిమా అవకాశాలు ఆగిపోయినప్పుడు, అతను మళ్లీ రేడియో రిపేర్ షాపులో పనిచేయడం ప్రారంభించాడు. పని కోసం అంతులేకుండా ఎదురుచూడకుండా, తన కుటుంబాన్ని పోషించడానికి దొరికిన పని చేసుకుంటూ వచ్చాడు. తన నటనారంగంలో కెరీర్ పతనమైన తర్వాత, మరిముత్తు జీవనోపాధి కోసం ఆటో నడపడం ప్రారంభించాడు. ఇటీవల, అతను ఆటోలు రిపేర్ చేస్తూ, ఆటో నడుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన కష్టకాలంలో పరిచయమైన కార్తీకను మరిముత్తు వివాహం చేసుకున్నాడు.ప్రస్తుతం ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు మరిముత్తు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




