AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీవితం మీద నిరాశ కలిగితే స్మశానానికి వెళ్లి కూర్చుంటా.. హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్

ప్రస్తుతం ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు రాణిస్తున్నారు. వరుస అవకాశాలు అందుకుంటూ తమ నటనతోపాటు గ్లామరస్ పాత్రలలోనూ మెప్పిస్తున్నారు. వారిలో ఈ అమ్మడు ఒకరు. తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అలాగే విభిన్నమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది ఈ చిన్నది.

జీవితం మీద నిరాశ కలిగితే స్మశానానికి వెళ్లి కూర్చుంటా.. హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
Actress
Rajeev Rayala
|

Updated on: Aug 08, 2026 | 11:58 AM

Share

కామాక్షి భాస్కర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతుంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంది ఈ అందాల భామ. మా ఉరి పొలిమేర సినిమాలో తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఈ చిన్నది. ఇక ఇప్పుడు మరో ఆసక్తికర సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతుంది. అగధా సినిమాలో ఈ ముద్దుగుమ్మ ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది కామాక్షి భాస్కర్ల.

ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘అగధా’పై చిత్రబృందం ఎంతో నమ్మకంతో ఉందని ఆమె తెలిపారు. సినిమా తుది కాపీ సిద్ధంగా ఉన్నందున, ప్రేక్షకులు తమ చిత్రాన్ని ఎలా స్వీకరిస్తారనే ఆసక్తితో పాటు కొంత టెన్షన్ కూడా ఉందని ఆమె అన్నారు. సినిమా బాగుంటుందని మాకు తెలుసు. అన్ని అంశాలు సరిగ్గా కలిసి, అనుకూల వాతావరణం ఏర్పడితే సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది” అని కామాక్షి భాస్కర్ల తెలిపింది. అయితే, ఈ రోజుల్లో సినిమా తీయడం ఒక ఎత్తయితే, దానిని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు అని ఆమె అభిప్రాయపడింది. స్టార్ నటులు లేకపోతే సినిమాకు ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి వెనుకాడతారని, ఓటీటీలో చూద్దామని అనుకుంటారని.. ‘పొలిమేర’ విషయంలో కూడా ఇలాగే జరిగిందని చెప్పుకొచ్చింది కామాక్షి. థ్రిల్లర్ లాంటి చిత్రాలను చిన్న తెరపై కాకుండా, పెద్ద తెరపై చూసినప్పుడే అసలైన అనుభూతి కలుగుతుంది” అని కామాక్షి స్పష్టం చేసింది. ఎం.ఎస్. రాజు గ్రాండియర్ సెట్స్‌కు పెట్టింది పేరని, ‘అగధా’ విజువల్స్ పెద్ద తెరపై మరింత ఆకట్టుకుంటాయని ఆమె పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

కామాక్షి భాస్కర్ల వ్యక్తిగత జీవితంపై చలం ‘మైదానం’ పుస్తకం చూపిన ప్రభావాన్ని గురించి కూడా మాట్లాడారు. చలం తన కాలంలో (1910-1940లు) మహిళల పరిమితులు, వారికి స్వేచ్ఛ లేని సమాజంలో కూడా, ‘ఆడది కూడా మనిషే’ అని చెప్పడానికి ప్రయత్నించారని కామాక్షి పేర్కొంది. ఆయన రాసిన పుస్తకాలను ఇప్పటికీ కొందరు దర్శకులు తెరపై చూపించడానికి సాహసించరని తెలిపింది. తాను అజ్ఞాతవాదినని, దేవుడు ఉన్నాడా లేడా అనే నమ్మకాలతో సంబంధం లేకుండా వాస్తవికంగా ఉంటానని ఆమె చెప్పుకొచ్చింది. తనకు కష్టాలు ఎదురైనప్పుడు లేదా జీవితంపై నిరాశ కలిగినప్పుడు స్మశాన వాటికకు వెళ్తానని, అక్కడకు వెళ్ళినప్పుడు డబ్బు, పేరు, హోదాలు ఎంత చిన్నవో అర్థమవుతుందని, జీవితం ఎంత తాత్కాలికమో తెలిసి ‘గ్రౌండెడ్’గా ఫీల్ అవుతానని కామాక్షి భాస్కర్ల చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us