క్యూట్ నెస్‌తో కట్టిపడేస్తున్న వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ 

20 September  2026

Rajeev 

Pic credit - Instagram

సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందే సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన హీరోయిన్లు చాలా అరుదుగా కనిపిస్తుంటారు.

అలాంటి అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్న అందాల భామ ప్రియా ప్రకాశ్ వారియర్. మలయాళ చిత్రం ఓరు ఆధార్ లవ్ సినిమాతో పరిచయం అయ్యింది. 

ఈ సినిమాలోని ఓ పాటలో ఆమె పలికించిన హావభావాలు, ముఖ్యంగా ఆ ఒక్క కన్నుగీటు, 2018లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆమెను అప్పట్లో ‘వింక్ గర్ల్’గా పిలిచేవారు. ఆతర్వాత హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తుంది. 

మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ప్రియా ప్రకాశ్ వారియర్ తెలుగు సినిమాల్లోనూ నటించారు. నితిన్ నటించిన  చెక్ సినిమాలో యాత్ర పాత్రలో కనిపించారు.

ఆ తర్వాత తేజ సజ్జతో కలిసి ఇష్క్ లో అనసూయ పాత్రను పోషించారు. 2023లో పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమాలోనూ నటించింది. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ క్రేజీ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ ఫోటోలు నెటిజన్స్ ను ఫిదా చేస్తున్నాయి.