AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Paradise: ది ప్యారడైజ్‌ సినిమాకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్

న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి.

The Paradise: ది ప్యారడైజ్‌ సినిమాకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్
The Paradise Movie
Rajeev Rayala
|

Updated on: Sep 20, 2026 | 8:19 PM

Share

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విడుదలకు ముందే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూవీకి ప్రత్యేక ప్రీమియర్ షో నిర్వహించడంతో పాటు, టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ‘ది ప్యారడైజ్’ సినిమాకు సెప్టెంబర్ 23న సాయంత్రం 6:30 గంటలకు ప్రత్యేక ప్రీమియర్ షో నిర్వహించేందుకు అనుమతి లభించింది. ఈ స్పెషల్ షోకు టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు. ఇందులో జీఎస్టీ కూడా కలిపి ఉంటుంది. సినిమా విడుదల రోజు నుంచి సెప్టెంబర్ 27 వరకు టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. ఈ కాలంలో మల్టీప్లెక్స్‌లలో ఒక్కో టికెట్‌పై రూ.94, జీఎస్టీతో కలిపి పెంపునకు అనుమతి ఇచ్చారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరపై రూ.48, జీఎస్టీతో కలిపి పెంచుకోవచ్చు.

ఏం పాటరా బాబు..! యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాంగ్.. విన్నకొద్దీ వినాలనిపించేలా ఉందిగా

అలాగే సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు కూడా టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ కాలంలో మల్టీప్లెక్స్‌లలో టికెట్‌పై రూ.45, జీఎస్టీతో కలిపి అదనంగా వసూలు చేసుకునేందుకు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.23, జీఎస్టీతో కలిపి పెంచుకునేందుకు అనుమతి లభించింది. టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వడంతో పాటు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిబంధనను విధించింది.

తెలుగు సినిమా దెబ్బకు కన్నీళ్లు పెట్టుకుంటున్న నార్త్ ఆడియన్స్.. ఓటీటీలో దూసుకుపోతున్న మూవీ

నిర్మాతలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు రూ.1 కోటి అందించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. దీంతో ‘ది ప్యారడైజ్’ విడుదల సందర్భంగా థియేటర్లలో టికెట్ ధరలు పెరగనున్నాయి. ప్రత్యేక ప్రీమియర్ షోకు కూడా అనుమతి రావడంతో సినిమా విడుదలపై ఆసక్తి మరింత పెరిగింది. దసరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శ్రీకాంత్, నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో నాని భారీ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు నాని అభిమానులు.

ఇవి కూడా చదవండి

చిరంజీవికి జోడిగా అందాల భామ.. మొదటిసారి మెగాస్టార్‌ సరసన సీనియర్ హీరోయిన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us