చిరంజీవికి జోడిగా అందాల భామ.. మొదటిసారి మెగాస్టార్ సరసన సీనియర్ హీరోయిన్
మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో జోరుమీదున్న మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో కాకాగా రానున్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా ఏకంగా రూ. 375 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రికార్డ్ క్రియేట్ చేసింది. దాంతో ఇప్పుడు కాకా సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ కాకా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వాల్తేరు వీరయ్యతో చిరంజీవికి భారీ విజయాన్ని అందించిన బాబీ.. ఈసారి మెగాస్టార్‌ను సరికొత్త అవతార్‌లో చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఇదిలా ఉంటే కాకా సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఓ సీనియర్ హీరోయిన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. అంతేకాదు.. ఆమె చిరంజీవి భార్య పాత్రలో కనిపించనున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? మరెవరో కాదు అందాల భామ స్నేహ.
Aditi Myakal : మేడమ్ సార్ మేడమ్ అంతే..! మెంటలెక్కిస్తున్న అర్జున్ రెడ్డి భామ
తెలుగు ప్రేక్షకులకు తొలి వలపు, హనుమాన్ జంక్షన్, గౌరి, శ్రీరామదాసు వంటి సినిమాలతో సుపరిచితమైన స్నేహ.. కొంతకాలంగా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ‘కాకా’ ద్వారా ఆమె మరోసారి టాలీవుడ్‌లో కీలక పాత్రతో కనిపించబోతున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. స్నేహ పాత్రకు సినిమాలో మంచి ప్రాధాన్యత ఉంటుందని టాక్. ఒకవేళ ఆమె చిరంజీవి సరసన భార్య పాత్రలో కనిపిస్తే.. చాలా కాలం తర్వాత మెగాస్టార్‌తో ఆమె స్క్రీన్ షేర్ చేసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉంది. అయితే ఈ పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియాలంటే మేకర్స్ నుంచి ప్రకటన రావాల్సిందే.
ఒకే ఒక్క సినిమా.. విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.. కట్ చేస్తే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది
ఇక కాకా టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది. ఇందులో చిరంజీవి కె. సత్యం అనే సాధారణ మధ్యతరగతి వ్యక్తిగా, ఆక్వా ఇండస్ట్రీలో సూపర్‌వైజర్‌గా కనిపించనున్నారు. రావులపాలెంలోని ‘అమ్మాజీ ఆక్వా ఇండస్ట్రీస్’లో పనిచేసే సత్యం జీవితం ప్రశాంతంగా సాగుతున్నట్టుగా గ్లింప్స్‌లో చూపించారు. అయితే అతని గతానికి సంబంధించిన మరో కోణాన్ని గ్లింప్స్‌లో హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో పరిచయం చేశారు. అంటే.. ఒకవైపు కుటుంబం, సాధారణ జీవితం కనిపిస్తే.. మరోవైపు గతంలో తుపాకులు, యాక్షన్‌తో సంబంధం ఉన్న చిరంజీవి మరో షేడ్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు భిన్నమైన కోణాలే ‘కాకా’ కథపై ఆసక్తిని పెంచుతున్నాయి. మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఆమె ఫస్ట్ లుక్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. అలాగే నివేదా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను తదితరులు కూడా సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ‘కాకా’ను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
అప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్.. కట్ చేస్తే మాజీ సీఎం భార్య.. ఇద్దరి మధ్య 27ఏళ్ల ఏజ్ గ్యాప్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




