AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతను డాన్స్ చేస్తుంటే చూపు తిప్పుకోలేం.. మైకేల్ జాక్సన్ కన్నా ఆ స్టార్ హీరోనే బెస్ట్

నటి రంభ తన సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె కెరీర్ హైలైట్స్, ఇష్టమైన విషయాలు, కొన్ని దాచిపెట్టిన రహస్యాలను వెల్లడించారు. అలాగే ఓ స్టార్ హీరో గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు రంభ.

అతను డాన్స్ చేస్తుంటే చూపు తిప్పుకోలేం.. మైకేల్ జాక్సన్ కన్నా ఆ స్టార్ హీరోనే బెస్ట్
Rambha
Rajeev Rayala
|

Updated on: Sep 11, 2026 | 4:14 PM

Share

ఒకప్పుడు తన అందంతో కుర్రాళ్లను కవ్వించిన భామల్లో రంభ ఒకరు. ఆమె అందం నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అప్పట్లో స్టార్ హీరోల సరసన నటించింది మిప్పించింది. తన అందంతో ఇండస్ట్రీని ఊపేసింది. సినిమాలో హీరోయిన్ గా చేస్తూనే మరో వైపు స్పెషల్ సాంగ్స్ లోనూ మెప్పించింది రంభ. అందం అభినయంతో ఉర్రుతలూగించిన రంభ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. రంభ గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు రంభ.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొన్నటి వరకు టాలీవుడ్ స్టార్ హీరోగా రాణించిన తారక్, ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఇప్పుడు తారక్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఆయన డాన్స్‌లకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్‌లో బెస్ట్ డాన్సర్ ఎవరంటే ఎన్టీఆర్ పేరే చెబుతారు.

ఎన్టీఆర్ డాన్స్ గురించి ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ప్రశంసించారు. అలాగే నటి రంభ కూడా తారక్ డాన్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, జూనియర్ ఎన్టీఆర్ నటన అంటే ఎంతో ఇష్టమని తెలిపింది. తాను చేసిన ఐటెం సాంగ్స్ లో నాచోరే నాచోరే సాంగ్ అంటే ఇష్టమని రంభ చెప్పింది. ఎన్టీఆర్ డాన్స్ చేస్తే కన్నార్పకుండా చూస్తామని, ఆయన డెడికేషన్ చూస్తే పిచ్చెక్కుతుందని ఆమె పేర్కొంది. తన దృష్టిలో మైకేల్ జాక్సన్ కన్నా తారక్ బెస్ట్ డాన్సర్ అని రంభ ప్రశంసలతో ముంచెత్తింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రంభ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లతో సినిమా చేయాలనే తన కోరికను కూడా బయటపెట్టింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us