AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aditi Myakal : మేడమ్ సార్ మేడమ్ అంతే..! మెంటలెక్కిస్తున్న అర్జున్ రెడ్డి భామ

సినిమాల్లో కొందరు హీరోయిన్లుగా కాకుండా సహాయ నటీమణులుగా మెరిసిపోతూ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటారు. తమ అందం, నటనతో ఆకట్టుకునే ఇలాంటి నటీమణులు ఒక్కోసారి కథానాయికల కంటే ఎక్కువగా గుర్తుండిపోతారు. అలాంటి వారిలో నటి అదితి మ్యాకల్ కూడా ఒకరు.

Rajeev Rayala
|

Updated on: Sep 15, 2026 | 2:26 PM

Share
సినిమాల్లో కొందరు హీరోయిన్లుగా కాకుండా సహాయ నటీమణులుగా మెరిసిపోతూ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటారు. తమ అందం, నటనతో ఆకట్టుకునే ఇలాంటి నటీమణులు ఒక్కోసారి కథానాయికల కంటే ఎక్కువగా గుర్తుండిపోతారు. అలాంటి వారిలో నటి అదితి మ్యాకల్ కూడా ఒకరు. ఈమె పేరు చెప్పగానే చాలామంది సినీ ప్రేక్షకులకు విజయ్ దేవరకొండ నటించిన సూపర్‌హిట్ మూవీ అర్జున్ రెడ్డి గుర్తుకొస్తుంది.

1 / 6
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండకు స్టార్ హీరోగా భారీ క్రేజ్ వచ్చింది. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ చిత్రంలో నటించిన పలువురు నటీనటులు సైతం తమ పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అలా అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ ఫ్రెండ్ పాత్రలో కనిపించి మెప్పించిన నటి అదితి మ్యాకల్.

2 / 6
సినిమాలో ఆమె కనిపించిన తీరు, నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఈమెకు మంచి గుర్తింపు లభించింది. అదితి మ్యాకల్‌కు చిన్నతనం నుంచే కళలపై ఆసక్తి ఉండేది. ఆమె చిన్న వయసులోనే కూచిపూడిని అభ్యసించి పలు ప్రదర్శనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును కూడా పూర్తి చేసింది. ఫ్యాషన్ రంగంపై ఆసక్తితో పలు ఫ్యాషన్ షోలలో పాల్గొంది. కళలపై ఉన్న ఇష్టంతో పాటు సినిమాలపై ఉన్న మక్కువ ఆమెను నటన వైపు అడుగులు వేయించేలా చేసింది. మొదట యూట్యూబ్ వెబ్‌సిరీస్‌లు, షార్ట్ ఫిలిమ్స్‌లో నటిస్తూ తన ప్రతిభను చాటుకుంది.

3 / 6
అదితి మ్యాకల్ పాప పి సుశీల, ముద్దపప్పు ఆవకాయ్, పాష్ పోరీస్ వంటి ప్రాజెక్టుల్లో నటించింది. ఆ తర్వాత సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంది. అర్జున్ రెడ్డితో పాటు అమీ తుమీ, రాధ, మిఠాయ్, దెబ్బకు ఠా.. దొంగల ముఠా, నేనులేని నా ప్రేమకథ వంటి చిత్రాల్లో కనిపించి ప్రేక్షకులను అలరించింది. హీరోయిన్‌గా కూడా కొన్ని సినిమాల్లో నటించిన అదితి, ఎక్కువగా సహాయక పాత్రల ద్వారానే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

4 / 6
విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నం చేస్తోంది. సినిమాల్లో సంప్రదాయబద్ధమైన పాత్రల్లో కనిపించే అదితి మ్యాకల్, సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామరస్ లుక్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆమె షేర్ చేసే ఫొటోలు, ఫ్యాషన్ స్టైలింగ్‌కు సంబంధించిన పోస్టులు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంటాయి.

5 / 6
సోషల్ మీడియా ఫొటోల్లో అదితి మరింత స్టైలిష్‌గా కనిపించడంతో ఆమెను చూసిన అభిమానులు, “అర్జున్ రెడ్డి సినిమాలో నటించింది ఈమెనేనా..?” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ అమ్మడి ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం సహాయక పాత్రల్లో నటిస్తూ తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఈ భామకు భవిష్యత్తులో మరిన్ని మంచి అవకాశాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

6 / 6
Follow Us