AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే ఒక్క సినిమా.. విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.. కట్ చేస్తే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. ప్రతిభతో పాటు అదృష్టం, సరైన కథ, ఆకట్టుకునే పాత్ర.. ఇలా ఎన్నో అంశాలు కలిసొస్తేనే కథానాయికలకు మంచి క్రేజ్ దక్కుతుంది. అయితే, ప్రస్తుత రోజుల్లో పరిస్థితులు కాస్త మారిపోయాయి. ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకుంటున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు.

Rajeev Rayala
|

Updated on: Sep 15, 2026 | 2:19 PM

Share
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. ప్రతిభతో పాటు అదృష్టం, సరైన కథ, ఆకట్టుకునే పాత్ర.. ఇలా ఎన్నో అంశాలు కలిసొస్తేనే కథానాయికలకు మంచి క్రేజ్ దక్కుతుంది. అయితే, ప్రస్తుత రోజుల్లో పరిస్థితులు కాస్త మారిపోయాయి. ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకుంటున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావంతో కొందరు భామలు ఒక్క పాటతోనే ఓవర్‌నైట్ సెన్సేషన్లుగా మారుతున్నారు.

1 / 5
అలాంటి బ్యూటీల జాబితాలోకి వచ్చిన అందాల తార దివ్య భారతి కూడా ఒకరు. తొలి సినిమాతోనే యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరు? ఆమె సినీ ప్రయాణం ఎలా సాగింది? తెలుసుకుందాం.  దివ్య భారతి తమిళ సినిమా ‘బ్యాచిలర్’తో కథానాయికగా పరిచయమైంది. జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రానికి సతీష్ సెల్వకుమార్ దర్శకత్వం వహించారు.

2 / 5
రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో దివ్య భారతి తన నటనతో పాటు గ్లామర్‌తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలి సినిమాతోనే ఈ బ్యూటీకి మంచి పాపులారిటీ వచ్చింది. ముఖ్యంగా సినిమాలోని పాటలు, రొమాంటిక్ సన్నివేశాలు యువతను ఆకట్టుకోవడంతో దివ్య భారతి పేరు సోషల్ మీడియాలోనూ మార్మోగింది.  ‘బ్యాచిలర్’ సినిమాలోని కొన్ని పాటలు అప్పట్లో బాగా పాపులర్ అయ్యాయి. అందులో దివ్య భారతి కనిపించిన తీరు, ఆమె స్క్రీన్ ప్రజెన్స్ యువతను ఆకర్షించాయి. దీంతో ఈ అమ్మడికి సోషల్ మీడియాలో అభిమానుల సంఖ్య పెరిగింది.

3 / 5
తొలి చిత్రంతోనే ప్రత్యేకమైన గుర్తింపు రావడంతో దివ్య భారతి ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆమె అందం, స్టైలిష్ లుక్స్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. ఫలితంగా ఈ చిన్నది తమిళ ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తొలి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దివ్య భారతి ఆ తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ ముందుకు సాగింది. జీవీ ప్రకాశ్ కుమార్‌తో కలిసి ‘కింగ్‌స్టన్’ చిత్రంలోనూ కనిపించింది. అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి.

4 / 5
తమిళంలో హీరోయిన్‌గా పరిచయమైన దివ్య భారతి ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. టాలీవుడ్ హీరో సుడిగాలి సుధీర్ నటిస్తున్న సినిమాలో ఆమె కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ దివ్య భారతి చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫొటోషూట్‌లకు సంబంధించిన చిత్రాలను, వ్యక్తిగత ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఆమె గ్లామరస్ లుక్స్‌కు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది. 

5 / 5
Follow Us