AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలాంటి హీరోను నేను ఎక్కడ చూడలేదు.. చాలా నేచురల్ గా యాక్ట్ చేస్తాడు : సంపత్ రాజ్

నటుడు సంపత్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నాడు ఈ వర్సటైల్ యాక్టర్. సహాయక పాత్రలే కాదు విలన్ గానూ నటిస్తూ మెప్పిస్తున్నాడు. ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాతో సంపత్ రాజ్ కు మంచి గుర్తింపు వచ్చింది.

అలాంటి హీరోను నేను ఎక్కడ చూడలేదు.. చాలా నేచురల్ గా యాక్ట్ చేస్తాడు : సంపత్ రాజ్
Sampath Raj
Rajeev Rayala
|

Updated on: Sep 15, 2026 | 8:28 AM

Share

వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు సంపత్ రాజ్. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత శ్రీమంతుడు వంటి చిత్రాల్లోనూ కీలక పాత్రల్లో కనిపించి మెప్పించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, స్టార్ హీరోలతో పనిచేసిన అనుభవాలను పంచుకున్న సంపత్ రాజ్.. మహేష్ బాబు, ప్రభాస్, దర్శకుడు కొరటాల శివ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. శ్రీమంతుడు సినిమాలో తన పాత్రకు సంబంధించిన విషయాలను గుర్తుచేసుకున్న సంపత్ రాజ్.. దర్శకుడు కొరటాల శివ తనను సంప్రదించిన తీరును వివరించారు. కొరటాల శివ కథ చెప్పిన విధానం, రచయితగా ఆయనపై తనకున్న నమ్మకం.. ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణాల్లో ఒకటని తెలిపారు. కథను వివరించేటప్పుడు తన పాత్రను తాను తప్పకుండా చేయాలని కొరటాల శివ కోరారని, ఆయన కథనంలో ఉన్న బలమే తనను ఆకట్టుకుందని చెప్పారు.

శ్రీమంతుడు తన కెరీర్‌లో మంచి ప్రభావాన్ని చూపించిన సినిమాల్లో ఒకటని సంపత్ రాజ్ పేర్కొన్నారు. సినిమాలోని కథ, పాత్రల రూపకల్పన తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటనపై సంపత్ రాజ్ ప్రశంసలు కురిపించారు. మహేష్ బాబు చాలా సహజమైన నటుడని, మనం నిజ జీవితంలో ఎలా మాట్లాడుకుంటామో.. ఆయన కూడా కెమెరా ముందు అదే విధంగా నటిస్తారని అన్నారు. మహేష్ బాబు నటనలో ఎలాంటి అతిశయోక్తి కనిపించదు. ఇద్దరు వ్యక్తులు నిజ జీవితంలో మాట్లాడుకుంటున్నట్టుగానే ఆయన సన్నివేశాలను పండిస్తారు. ఆ సహజత్వమే తెరపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది అని సంపత్ రాజ్ వివరించారు.

మహేష్ బాబు ఆరా, లుక్స్, పర్సనాలిటీ కూడా ఆయన నటనకు అదనపు బలాన్ని చేకూరుస్తాయని ప్రశంసించారు. ఆయనతో కలిసి పనిచేయడం మంచి అనుభవంగా నిలిచిందని తెలిపారు. ప్రభాస్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మిర్చి సినిమా తన కెరీర్‌లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుందని సంపత్ రాజ్ తెలిపారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి ప్రభావాన్ని చూపించిందని, అందులో విలన్‌గా నటించిన తనకూ అదే స్థాయిలో గుర్తింపు లభించిందని చెప్పారు. కొరటాల శివ దర్శకుడిగా పరిచయమైన తొలి చిత్రం ‘మిర్చి’ అని గుర్తుచేసుకున్న సంపత్ రాజ్.. అప్పటికే తన తమిళ సినిమాలను చూసిన కొరటాల శివ, తనకు కథ చెప్పారని వెల్లడించారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాన్ని, అందులోని కీలకమైన డైలాగ్‌ను దర్శకుడు వివరించిన తీరు తనకు బాగా నచ్చిందని తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us