సారధి స్టూడియో మాదే..! అప్పుడు అమ్మేసాం.. ఆ భూమి ధర ఇప్పుడు వేల కోట్లు పెరిగింది
నటుడు జీవీ నారాయణ రావు ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలుగు సినిమా చరిత్రలో సారధి స్టూడియోకు ఉన్న ప్రాముఖ్యతను, తన కుటుంబంతో దానికి ఉన్న బంధాన్ని గురించి వివరించారు. ఆయన బాల్యం, తమ కుటుంబం నవయుగ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం, సారధి స్టూడియో ఎలా వారి ఆధీనంలోకి వచ్చింది

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో జి.వి. నారాయణరావు ఒకరు. ఇటీవలే ఆయన తుది శ్వస విడిచారు. నటుడిగానే కాదు నిర్మాతగానూ రాణించారు జి.వి. నారాయణరావు. 1976లో వచ్చిన అంతులేని కథ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆయన.. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. హీరోగా, సహాయ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే నారాయణరావు గతంలో ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణంతో పాటు అప్పటి సినీ పరిశ్రమకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఒకప్పుడు ఎంతో కీలకంగా ఉన్న సారధి స్టూడియోస్ గురించి ఆయన చెప్పిన వివరాలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అమీర్‌పేట ప్రాంతం అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటి. మెట్రో రైలు,కమర్షియల్ ప్రాపర్టీ, విద్యా సంస్థలతో నిత్యం సందడిగా కనిపించే ఈ ప్రాంతంలో ఓ సినీ స్టూడియో కూడా ఉంది. అదే సారధి స్టూడియోస్.
Aditi Myakal : మేడమ్ సార్ మేడమ్ అంతే..! మెంటలెక్కిస్తున్న అర్జున్ రెడ్డి భామ
జి.వి. నారాయణరావు చెప్పిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం అమీర్‌పేటలో ఉన్న విలువైన భూమి ఒకప్పుడు సారధి స్టూడియోస్‌కు సంబంధించినదే. ప్రస్తుతం ఆ ప్రాంతంలోని భూమి విలువ వేల కోట్ల రూపాయలకు చేరినట్లు ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు సినిమాల నిర్మాణానికి కీలక కేంద్రంగా ఉన్న ఆ ప్రదేశం ఇప్పుడు హైదరాబాద్‌లో అత్యంత విలువైన ప్రాంతాల్లో ఒకటిగా మారిపోయిందని ఆయన గుర్తు చేసుకున్నారు. సినీ పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు క్రమంగా తరలివస్తున్న సమయంలో స్టూడియోలకు భారీ అవసరం ఏర్పడిందని నారాయణరావు తెలిపారు. ఆ సమయంలో సారధి స్టూడియోస్ ఏర్పాటుకు అనేక అంశాలు దోహదపడ్డాయని చెప్పారు.
ఒకే ఒక్క సినిమా.. విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.. కట్ చేస్తే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది
సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు రావడం ప్రారంభమైన సమయంలో సారధి స్టూడియోస్‌ను అభివృద్ధి చేయాలనే ఆలోచనకు ప్రాధాన్యత పెరిగిందని చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రోత్సాహం కూడా స్టూడియో అభివృద్ధికి ఉపయోగపడిందని ఆయన పేర్కొన్నారు. అప్పటి రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్‌కు వచ్చిన సమయంలో సినిమాల షూటింగ్‌కు అవసరమైన స్టూడియో సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేవి కావని నారాయణరావు తెలిపారు. దీంతో చల్లపల్లి మహారాజా చల్లపల్లి రామకృష్ణ ప్రసాద్కు చెందిన సారధి బ్యానర్‌ను ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేసుకున్నారు. తర్వాత నవయుగ ఫిలిమ్స్.. సారధి స్టూడియోస్‌లో 45 శాతం వాటాలను కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు. ఈ నేపథ్యంలోనే తన తండ్రి 1964లో గుంటకల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి స్టూడియో నిర్వహణ బాధ్యతలను చేపట్టారని తెలిపారు. సారధి స్టూడియోస్ ప్రారంభమైన సమయంలో అక్కడ కేవలం ఒక ఫ్లోర్ మాత్రమే ఉండేదని నారాయణరావు చెప్పారు. తర్వాత స్టూడియో విస్తరించి మూడు ఫ్లోర్‌లకు చేరిందని తెలిపారు. ఆ తర్వాత సారధి స్టూడియోస్‌లో షూటింగ్‌లు జోరుగా సాగుతూ, మంచి పేరును సంపాదించిందని ఆయన గుర్తుచేసుకున్నారు. సారధి స్టూడియోస్‌ను తర్వాత ఎందుకు అమ్మాల్సి వచ్చిందన్న విషయాన్ని కూడా నారాయణరావు వివరించారు. నవయుగ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉండేదని, కుటుంబ సభ్యుల మధ్య వాటాలు ఉండేవని చెప్పారు. అయితే తరాలు మారే కొద్దీ కుటుంబంలో అభిప్రాయ భేదాలు రావడం, తదుపరి తరానికి చెందిన కొందరు సినీ రంగం కాకుండా ఇతర వృత్తుల వైపు వెళ్లిపోవడంతో స్టూడియో నిర్వహణ కష్టంగా మారిందని తెలిపారు. 1964లో కొనుగోలు చేసిన ఈ ఆస్తిని 1980లలో, సుమారు 1984 ప్రాంతంలో కోట్ల రూపాయలకు విక్రయించినట్లు జి.వి. నారాయణరావు తెలిపారు. అప్పట్లో కోట్లలో ఉన్న ఆ ఆస్తి విలువ.. నేడు హైదరాబాద్ నగరం విస్తరించడం, అమీర్‌పేట ప్రాంతం కమర్షియల్ గా అభివృద్ధి చెందడంతో భారీగా పెరిగిందని చెప్పారు. ప్రస్తుతం ఆ భూమి విలువ వేల కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
అప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్.. కట్ చేస్తే మాజీ సీఎం భార్య.. ఇద్దరి మధ్య 27ఏళ్ల ఏజ్ గ్యాప్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




