AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మునగాకుతో అదిరిపోయే రోటీ పచ్చడి.. ఇలా చేస్తే ముద్ద ముద్దకు ఆహా అనాల్సిందే

మునగ ఆకుతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. చాలా మంది దీని ఆకుతో అనేక రకాల వంటకాలు చేసుకొని తింటుంటారు. ముఖ్యంగా ఎక్కువగా పొడి చేసుకొని తింటారు. కానీ పల్లెటూరి స్టైల్‌లో ఇలా మునగాకుతో రోటీ పచ్చడి చేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుందంట. కాగా, దానిని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి

Samatha J
|

Updated on: Sep 19, 2026 | 8:32 AM

Share
కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే..  మునగాకు: రెండు కప్పులు లేతవి మాత్రమే తీసుకోవాలి ,  నువ్వులు: అర కప్పు, ధనియాలు: ఒక టీ స్పూన్,   పచ్చిమిరపకాయలు,  టమాటా ముక్కలు: ఒక కప్పు,   చింతపండు: నిమ్మకాయ సైజు ,  వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర: అర టీ స్పూన్, ఉప్పు: రుచికి సరిపడా,  నూనె: ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు,   కరివేపాకు.

1 / 5
తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో అర కప్పు నువ్వులు, ఒక టీ స్పూన్ ధనియాలు వేసి మీడియం ఫ్లేమ్‌లో నువ్వులు చిటపటమనే వరకు వేయించాలి. వేగిన నువ్వులను మిక్సీ గిన్నెలోకి తీసుకుని చల్లారనివ్వాలి.  తర్వాత అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె తీసుకొని, కట్ చేసి పెట్టుకున్న పచ్చి మిర్చి, కరివేపాకు బాగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

2 / 5
 దీని తర్వాత మునగాకును కూడా అలాగే వేయించాలి. మునగాకు పచ్చి వాసన పోయి, దగ్గర పడే వరకు వేయించుకుంటూనే ఉండాలి. తర్వాత  అదే కడాయిలో కొద్దిగా నూనె తీసుకొని, ఒక కప్పు టమాటా ముక్కలు, చింత పండు వేసి మూతపెట్టాలి. అవి మంచిగా ఉడికి, మగ్గే వరకు కలుపుతూ ఉండాలి. మగ్గిన తర్వాత చల్లారనివ్వాలి.

3 / 5
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో  మనం ముందుగా వేయించి పెట్టుకున్న  నువ్వులు, కరివేపాకు , పచ్చి మిర్చి , మునగాకు, టమాటా చింత పండు, వెల్లుల్లి రెబ్బలు గుప్పెడు, అరటీస్పూన్ జీలకర్ర, సరిపడ ఉప్పు ఇవన్నీ రోటీలో వేసి మంచిగా దంచుకోవాలి. బాగా మెత్తగా దంచిన తర్వాత దీనిని మరొక బౌల్‌లోకి తీసుకోవాలి.

4 / 5
ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం స్టవ్ ఆన్ చేసి, చిన్న పోపు పాన్ పెట్టి, అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఇంగువ, ఎండు మిరిపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, అన్నీ వేసి వేయించుకోవాలి. చివరగా పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత ఈ పోపును మనం రుబ్బుకున్న మునగాకు పేస్ట్‌లో వేయాలి. అంతే మునగాకు రోటీ పచ్చడి రెడీ.

5 / 5
Follow Us
దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం

ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ

అక్టోబర్ 10 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం

భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం

రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!

వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్

రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?

పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!