AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Roja: ఆ హీరో నేను మారువేషంలో బిర్యానీ తినడానికి వెళ్లేవాళ్లం.. షాకింగ్ విషయం చెప్పిన రోజా

ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఆర్కే రోజా తన సినీ ప్రస్థానం, టాలీవుడ్ స్టార్ హీరోలతో ఆమెకు గల అనుబంధం గురించి ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తనను చూస్తుంటే, పాత రోజుల్లో తనతో కలిసి నటించిన హీరోలు ఆశ్చర్యపోతారని తెలిపారు.

Roja: ఆ హీరో నేను మారువేషంలో బిర్యానీ తినడానికి వెళ్లేవాళ్లం.. షాకింగ్ విషయం చెప్పిన రోజా
Roja
Rajeev Rayala
|

Updated on: Sep 19, 2026 | 8:47 AM

Share

ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు రోజా తన సుదీర్ఘ సినీ ప్రస్థానంపై అనేక ఆసక్తికర విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 90వ దశకంలో హీరోయిన్‌గా తన కేరీర్ టాప్ లో ఉన్నప్పుడు ఎదురైన సవాళ్లు, సహనటులతో తన అనుబంధం, అలాగే తన సినీ జీవితంలోని ప్రత్యేక మైలురాళ్లను వివరించారు రోజా. ఆ సమయంలో నటి మీనాతో తనకు గట్టి పోటీ ఉండేదని రోజా గుర్తుచేసుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో తామిద్దరే ముఖ్య నటీమణులుగా వెలుగొందామని, ఆన్‌స్క్రీన్ పై పోటీ పడుతున్నా, ఆఫ్-స్క్రీన్ లో మంచి స్నేహితులమని తెలిపారు. రంభ వంటివారు తమకు జూనియర్స్ అని, రమ్యకృష్ణ, నగ్మా వంటివారు సీనియర్స్ అని పేర్కొన్నారు రోజా. చిరంజీవితో తనకు అద్భుతమైన అనుబంధం ఉందని రోజా వెల్లడించారు. బయట గుర్తుపట్టేస్తారని, చిరంజీవి, సురేఖ, తాను కలిసి మారువేషాల్లో ఖైరతాబాద్‌లోని ఓ ప్రసిద్ధ బిర్యానీ సెంటర్‌కు వెళ్లి బిర్యానీ తినేవారమని గుర్తు చేసుకున్నారు.

Aditi Myakal : మేడమ్ సార్ మేడమ్ అంతే..! మెంటలెక్కిస్తున్న అర్జున్ రెడ్డి భామ

ముఠామేస్త్రి సినిమాలో మామ మామ పాట చిత్రీకరణ సమయంలో చిరంజీవి తన నటనను, డాన్స్‌ను ప్రశంసించారని తెలిపారు. సురేఖ కూడా తన డాన్స్ అంటే ఇష్టమని, చిరంజీవికి సమానంగా బాగా చేస్తావని మెచ్చుకునేవారని రోజా చెప్పారు. బాలకృష్ణతో చాలా సినిమాలు చేశానని, చిరంజీవితో మూడు సినిమాలు చేశానని తెలిపారు. సహనటులతో ఎప్పుడూ ఎలాంటి విభేదాలు రాలేదని, అందరితో స్నేహపూర్వకంగా ఉండేదాన్ని అని అన్నారు. జెలసీకి తావు లేకుండా, ఉన్నంతవరకు హ్యాపీగా నవ్వుతూ ఉంటానని, అదే తన సీక్రెట్ అని రోజా వివరించారు.

ఒకే ఒక్క సినిమా.. విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.. కట్ చేస్తే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది

వెంకటేష్‌తో తనకు గ్యాప్ వచ్చిందనే ప్రచారంపై రోజా క్లారిటీ ఇచ్చారు. తాను వెంకటేష్‌తో ఒక్క సినిమా మాత్రమే చేశానని, అది వ్యక్తిగత కారణం కాదని చెప్పారు. తమిళంలో విజయకాంత్ నటించిన ఒక సినిమా హిట్ అయిందని, దానిని తెలుగులో చామంతి పేరుతో రీమేక్ చేయాలనుకున్నారని తెలిపారు. మొదట డైరెక్టర్ సెల్వతో ఒక సినిమాకు పూజ జరిపిన తర్వాత, సెల్వకు తెలియకుండానే అదే షెడ్యూల్, కాస్టింగ్‌తో (వెంకటేష్, విజయశాంతి) ఆ రీమేక్‌ను తెరకెక్కించడానికి ప్రయత్నించారని, దీనివల్ల సెల్వ మనస్తాపం చెందారని రోజా వెల్లడించారు. ఇది సెల్వ, నిర్మాత నర్సారెడ్డి, వెంకటేష్‌లకు సంబంధించిన విషయమని, తనతో వెంకటేష్‌కు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

అప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్.. కట్ చేస్తే మాజీ సీఎం భార్య.. ఇద్దరి మధ్య 27ఏళ్ల ఏజ్ గ్యాప్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us