AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం పాటరా బాబు..! యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాంగ్.. విన్నకొద్దీ వినాలనిపించేలా ఉందిగా

ప్రస్తుతం యూట్యూబ్‏ను షేక్ చేస్తున్నాయి తెలంగాణ ఫోక్ సాంగ్స్. పల్లె పాటలు ఇప్పుడు ప్రపంచాన్ని ఏలేస్తున్నాయి. గ్రామాల్లో సాధారణంగా అమ్మలక్కలు పాడుకునే పాటలే ఇప్పుడు సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే ఎన్నో పాటలు విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాయి. వాటిలో ఈ సాంగ్ ఒకటి.

ఏం పాటరా బాబు..! యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాంగ్.. విన్నకొద్దీ వినాలనిపించేలా ఉందిగా
Song
Rajeev Rayala
|

Updated on: Sep 19, 2026 | 11:27 AM

Share

తెలంగాణ పల్లె పాటలకు ప్రస్తుతం ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వేడుకలు, పెళ్లిళ్లు, పండుగల సమయంలో మాత్రమే వినిపించే జానపద గీతాలు.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ యాస, పల్లె పదాలు, సహజమైన భావోద్వేగాలతో రూపొందుతున్న ఫోక్ సాంగ్స్ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో భారీగా వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే చాలా ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. మిలియన్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయి జానపదగీతాలు. ఇలాంటి పాటల్లో ‘ఉడుకుడుకు రొట్టెలు’ కూడా ఒకటి. కొంతకాలం క్రితం విడుదలైన ఈ పాట సోషల్ మీడియాలో ఒక్కసారిగా ట్రెండ్ అయింది. పాటలోని పల్లె పదాలు, భార్య ఆవేదనను ప్రతిబింబించే లిరిక్స్, వాటికి జతైన డీజే మ్యూజిక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఫలితంగా ఈ పాటకు యూట్యూబ్‌లో భారీ సంఖ్యలో వ్యూస్ వచ్చాయి.

Aditi Myakal : మేడమ్ సార్ మేడమ్ అంతే..! మెంటలెక్కిస్తున్న అర్జున్ రెడ్డి భామ

‘ఉడుకుడుకు రొట్టెలు ఉట్టిమీదుండంగా..’ అంటూ సాగే ఈ జానపద గీతం ఓ ఇల్లాలి బాధను కథగా చెబుతుంది. మరో మహిళ మాయలో పడిన భర్తను మందలిస్తూ భార్య తన ఆవేదనను పాట రూపంలో వ్యక్తం చేస్తుంది. సాధారణ పల్లె జీవితంలో వినిపించే మాటలను పాటగా మలచడం ఈ గీతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాటలోని తెలంగాణ యాస, పల్లెటూరి నుడికారం, సహజమైన ఎమోషన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో చిన్న చిన్న రీల్స్‌గా ఈ పాట విస్తృతంగా వినిపించడంతో మరింత మందికి చేరువైంది.

ఒకే ఒక్క సినిమా.. విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.. కట్ చేస్తే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది

ఈ పాటను తెలంగాణ ఫోక్ సాంగ్ రైటర్, గాయకుడు జోగుల వెంకటేశ్ రచించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన సంగీత ప్రయాణం గురించి ఆయన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘ఉడుకుడుకు రొట్టెలు’ పాటను రూపొందించే సమయంలో డీజే మ్యూజిక్‌ను ఉపయోగించడంపై మొదట కొంత సందేహం ఉన్నప్పటికీ, సన్నిహితుల ప్రోత్సాహంతో పాటను పూర్తి చేసినట్లు చెప్పారు. అనంతరం పాటకు సంబంధించిన ఓ చిన్న ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది. అది అనూహ్యంగా వైరల్ కావడంతో పాటకు ఒక్కసారిగా భారీ ఆదరణ లభించింది. ప్రమో వీడియోకు కూడా తక్కువ సమయంలోనే భారీ వ్యూస్ రావడంతో పూర్తి పాటపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిందని అన్నారు.

ఇవి కూడా చదవండి

అప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్.. కట్ చేస్తే మాజీ సీఎం భార్య.. ఇద్దరి మధ్య 27ఏళ్ల ఏజ్ గ్యాప్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వార్తకూ.. వాస్తవం లేని ప్రచారానికీ తేడాను గుర్తించండి..
వార్తకూ.. వాస్తవం లేని ప్రచారానికీ తేడాను గుర్తించండి..
బీసీసీఐ సెలెక్షన్ తీరుపై మాజీ క్రికెటర్ ఫైర్
బీసీసీఐ సెలెక్షన్ తీరుపై మాజీ క్రికెటర్ ఫైర్
కోట్ల రెమ్యునరేషన్ పక్కనపెట్టి కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి.
కోట్ల రెమ్యునరేషన్ పక్కనపెట్టి కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి.
వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇక కాంటాక్ట్స్ కోసం..
వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇక కాంటాక్ట్స్ కోసం..
సైబీరియా ప్లేగు పరిశోధనా ల్యాబ్‌లో రెండో మరణం..? WHO ఆందోళన
సైబీరియా ప్లేగు పరిశోధనా ల్యాబ్‌లో రెండో మరణం..? WHO ఆందోళన
క్యాండీ క్రష్‌తో వరల్డ్‌ రికార్డు క్రియేట్ చేసిన ఇండియన్ కుర్రాడు
క్యాండీ క్రష్‌తో వరల్డ్‌ రికార్డు క్రియేట్ చేసిన ఇండియన్ కుర్రాడు
నాకు మా నాన్న కావాలి.. ఎగ్జామ్‌లో చిన్నారి ఆన్సర్..
నాకు మా నాన్న కావాలి.. ఎగ్జామ్‌లో చిన్నారి ఆన్సర్..
నానా పటేకర్ భార్య ఎవరో తెలుసా.. ? పదేళ్ల తర్వాత..
నానా పటేకర్ భార్య ఎవరో తెలుసా.. ? పదేళ్ల తర్వాత..
.. బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ ఉన్న వారికి ఇదే బెస్ట్
.. బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ ఉన్న వారికి ఇదే బెస్ట్
త్రయోదశి శ్రాద్ధం ఈ పూర్వీకుల కోసమే చేస్తారా? తర్పణం, పిండదానం..
త్రయోదశి శ్రాద్ధం ఈ పూర్వీకుల కోసమే చేస్తారా? తర్పణం, పిండదానం..