తెలుగు సినిమా దెబ్బకు కన్నీళ్లు పెట్టుకుంటున్న నార్త్ ఆడియన్స్.. ఓటీటీలో దూసుకుపోతున్న మూవీ
రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘ఇరుముడి’. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ డివోషినల్ థ్రిల్లర్ లో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించింది. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇరుముడి సినిమా సంచలన విజయం సాధించింది. తండ్రి, కూతుళ్ల సెంటిమెంట్ కు తోడు అయ్యప్ప స్వామి నేపథ్యం ఉండడంతో ఇరుముడి సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వచ్చాయి.

మాస్ మహారాజా రవితేజ నటించిన ఎమోషనల్ అండ్ డివోషనల్ మూవీ ఇరుముడి ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరిస్తోంది. సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు డిజిటల్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా హిందీ వెర్షన్‌ను చూసిన నార్త్ ప్రేక్షకులు రవితేజ నటనలో కనిపించిన మరో కోణాన్ని సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. థియేట్రికల్ రన్ తర్వాత ఇరుముడి డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రావడంతో వివిధ ప్రాంతాల ప్రేక్షకులకు సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్లలో చూడలేకపోయిన వారితో పాటు మరోసారి సినిమా అనుభూతిని పొందాలనుకునే ప్రేక్షకులకు ఓటీటీ రిలీజ్ మంచి అవకాశంగా మారింది.
Aditi Myakal : మేడమ్ సార్ మేడమ్ అంతే..! మెంటలెక్కిస్తున్న అర్జున్ రెడ్డి భామ
ఇప్పటివరకు రవితేజను ఎక్కువగా మాస్ ఎంటర్‌టైనర్లు, యాక్షన్ సినిమాలు, కామెడీ టైమింగ్‌తో గుర్తుపెట్టుకున్న ప్రేక్షకులకు ఇరుముడిలో ఆయన చేసిన పాత్ర భిన్నమైన అనుభూతిని అందిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో రవితేజ చూపించిన నటనపై సోషల్ మీడియాలో ప్రశంసలు కనిపిస్తున్నాయి. కొన్ని సన్నివేశాల్లో డైలాగ్స్ కంటే ఆయన హావభావాలే ఎక్కువగా మాట్లాడతాయని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. పాత్రలోని బాధ, ఆవేదన, అనుబంధాన్ని ఆయన కళ్లతోనే వ్యక్తం చేసిన తీరు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని అంటున్నారు.
ఒకే ఒక్క సినిమా.. విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.. కట్ చేస్తే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది
ఇరుముడిలో ప్రధానంగా కనిపించే తండ్రీకూతుళ్ల బాండింగ్ ప్రేక్షకులను కదిలించేలా ఉందనే టాక్ వినిపిస్తోంది. ప్రేమ, బాధ్యత, త్యాగం, అనుబంధం వంటి అంశాలను కథలో మేళవించిన విధానం సినిమాకు ఎమోషనల్ బలాన్ని ఇచ్చిందని ఆడియన్స్ అంటున్నారు. క్లైమాక్స్‌తో పాటు కీలకమైన ఎమోషనల్ సన్నివేశాలు ఓటీటీ ప్రేక్షకులను కూడా కట్టిపడేస్తున్నాయని సోషల్ మీడియా పోస్టుల్లో పలువురు పేర్కొంటున్నారు. రవితేజ సినిమాలకు హిందీ డబ్బింగ్ వెర్షన్ల ద్వారా నార్త్ ప్రేక్షకుల్లో ఇప్పటికే గుర్తింపు ఉంది. అయితే ఇరుముడి’ మాత్రం ఆయనలోని నటుడిని మరో కోణంలో పరిచయం చేస్తోందని కొందరు నార్త్ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌కు భిన్నంగా భావోద్వేగ కథలో రవితేజను చూడటం కొత్త అనుభూతిని ఇచ్చిందని పలువురు సోషల్ మీడియా యూజర్లు కామెంట్లు చేస్తున్నారు. సినిమా కేవలం స్టార్ హీరోను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఎంటర్‌టైనర్ కాదని, కుటుంబ బంధాలను ప్రధానంగా తీసుకెళ్లే ఎమోషనల్ కథగా ఉందని తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. థియేటర్లలో ప్రేక్షకుల నుంచి స్పందన అందుకున్న ‘ఇరుముడి’ ఇప్పుడు ఓటీటీ లో దూసుకుపోతుంది. ముఖ్యంగా హిందీ వెర్షన్‌కు వస్తున్న సోషల్ మీడియా రెస్పాన్స్ అంతా ఇంతా కాదు.
అప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్.. కట్ చేస్తే మాజీ సీఎం భార్య.. ఇద్దరి మధ్య 27ఏళ్ల ఏజ్ గ్యాప్
#Irumudi Hindi Review — A Film That Hurts Beautifully. ❤️🔥
Finally watched #Irumudi , and honestly, this is the kind of cinema that reminds you why films are meant to be felt, not just watched.
For me, it is easily one of the best Telugu films of the year and one of the most… pic.twitter.com/hRtluEgBqr
— Ashish Tiwari (@iamrounak11) September 18, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




