గత్తరలేపుతున్న బిగ్ బాస్ భామ దివి.. 

18 September  2026

Rajeev 

Pic credit - Instagram

తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు దివి వాద్య. మోడలింగ్‌తో కెరీర్‌ను ప్రారంభించిన ఈ అందాల భామ తనకంటూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. 

సినిమాలు, వెబ్ సిరీస్‌లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ అందాల భామ. అయితే బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో పాల్గొన్న తర్వాత దివికి ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ వచ్చింది.

బిగ్ బాస్ హౌస్‌లో తనదైన స్టైల్, మాటతీరు, వ్యక్తిత్వంతో దివి ప్రేక్షకులను ఆకట్టుకుంది. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.

ముఖ్యంగా గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనూ కనిపిస్తూ తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది.

దివి సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫొటోషూట్‌లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఆమె గ్లామరస్ లుక్స్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తుంటుంది. సంప్రదాయ దుస్తుల్లో కనిపించినా, మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో మెరిసినా దివి తన ప్రత్యేకమైన స్టైల్‌తో ఆకట్టుకుంటుంది.

బిగ్ బాస్ తర్వాత వచ్చిన గుర్తింపును సద్వినియోగం చేసుకుంటూ దివి వరుస ప్రాజెక్టులతో ముందుకు సాగుతోంది. సినిమాలతో పాటు డిజిటల్ కంటెంట్‌లోనూ అవకాశాలు అందుకుంటుంది.